#520
క్రైస్తవ గృహము
పల్లవి · Pallavi
ఎంతో రమ్యంబైనది భూతలమందు – ఎంతో మాన్యంబైనది చెంత జేరి యేసు వింత పాదాబ్జముల – సంతోషంబున పూజసల్పు క్రైస్తవ గృహము ||ఎంతో||
చరణము 1
పిల్లలొలీవ మొక్కలై – బల్ల చుట్టు – నెల్లప్పుడు ఆడుచున్ – నుల్లమందున యేసు చల్లని వాక్యంబున – నెల్లవేళల దలచి యుండుచుండెడి గృహము ||ఎంతో||
చరణము 2
తల్లిదండ్రులైక్యత – దనరుచునుండి – దాక్షిణ్య నిధుల మెలగి – యెల్ల ప్రేమామృ తమెల్లవారల కొసగి – కల్లోలములు వీడి – నుల్లసిల్లెడి గృహము ||ఎంతో||
చరణము 3
పొరుగువారల మైత్రిని – పొందుగ గోరి – పొలుపారు నీతిన్ దనరు – నూరుతరనాత్మ వరముల పైన గురిపించు – వరదాత యేసున్ – ప్రార్థించు క్రైస్తవ గృహము ||ఎంతో||
చరణము 4
శోధనల నన్నింటిని సర్వదా పైచి – శోభిల్లు విశ్వాసమున – మోదమొందగ యేసు నాథునందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిచ్చెడు క్రైస్తవ గృహము ||ఎంతో||
చరణము 5
వ్యర్థ ఖర్చుల మానుచు – వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ – వృద్ధి నొందెడు వేళ శ్రద్ధాభక్తులతోడా – ఇద్దరిత్రిని దశమభాగమొసగెడు గృహము ||ఎంతో||