#511

మోక్షాపేక్ష

రాగం: జంఝూటి (ఛాయ: ధరణిలోని ధనములెల్ల) · తాళం: ఆది · రచయిత: మిక్కిలి సమూయేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఏదియది ఏదియది – ఏదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు – బహుళ దుఃఖ పాశము ||ఏదియది||
చరణము 1
సిలోమను కొలను గల – జీవన ప్రదేశము పాలు తేనె లొల్కునట్టి – పరమ కానాన్ దేశము ||ఏదియది||
చరణము 2
ఆయతమై యున్నదది – యమర జనుల కోసము సీయోనను పేరుగల – శ్రీకరుని నివాసము ||ఏదియది||
చరణము 3
జీవ ప్రవాహములు గల – జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కె – రూబుల స్వదేశము ||ఏదియది||
చరణము 4
యేసు జన స్వాస్థ్యమిదే – ఇశ్రాయేలు దేశము మేసయ్యయను రాజు సదా – మృతములిడు దేశము ||ఏదియది||
చరణము 5
కోరికలు తీరునట్లు – గొబ్బుననే పోదురా చేరి సౌఖ్యమొంద మదినే – స్థిరత భూని యుంటిరా ||ఏదియది||
చరణము 6
మరణమును యోర్దాన్ నది – మధ్యమందు గంటిరా తరుణమునే గాచి దాని – దాటిపోవ నుంటిరా ||ఏదియది||
చరణము 7
కాలు ధరణి నిల్వదది – కండ్లు పడు దాకరా మేలుకొని యుంటిరా – మేర దాట లేకరా ||ఏదియది||