#510

మోక్ష వర్ణన

రాగం: శహన · తాళం: త్రిపుట · రచయిత: తూపిలి దానియేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవ దేవుని గొప్ప పురము పరలోకానందము క్రైస్తవ జీవితము యా పురము ||దేవ||
చరణము 1
దేవుని పురము – దీప్యకరము జీవ మందిరము జీవ గృహము ||దేవ||
చరణము 2
పరిశుద్ధ పురము – పరమార్థకరము పరమ మందిరము – పరదైసు పురము ||దేవ||
చరణము 3
ఆనంద పురము – ఆది నిరంతరము కాన దుస్తరము – ఘన మనోహరము ||దేవ||
చరణము 4
శృంగార పురము – సురుచిర కరము బంగారు మెరము – ప్రభల భాసురము ||దేవ||
చరణము 5
వైభవ పురము – వంద్యమప్పురము సౌభాగ్య కరము – స్పటిక మందిరము ||దేవ||
చరణము 6
కెంపు పాండురము – కీర్తి బంధురము ఇంపౌ నగరము – ఇదియే సుస్థిరము ||దేవ||
చరణము 7
క్షుధలేని పురము – సుక్షేమ కరము ముదము విస్తరము – రొదలు దుస్తరము ||దేవ||
చరణము 8
ఆశ్చర్య పురము – ఆశ్రయ కరము నిశ్చయపరము – నిజదేవ పురము ||దేవ||
చరణము 9
మాణిక్య పురము – మణుల గోపురము వీణెల స్వరము – విన మనోహరము ||దేవ||
చరణము 10
సూర్యభాసురము – చొరనట్టి పురము కార్య మబ్బురముగావించు గరము ||దేవ||
చరణము 11
సీయోను పురము – శ్రేయస్సాగరము మాయ విధురము – మరి సంపత్కరము ||దేవ||
చరణము 12
ఇచ్చు నిబ్బరము – యెరూషలేం పురము మెచ్చు నబ్బురము – మెరయు మా పురము ||దేవ||