#501
క్రీస్తు మోక్ష ద్వారము
పల్లవి · Pallavi
శృంగార ద్వారంబు – మా యేసు మోక్ష – మార్గంబున ఎంతో – శృంగార ద్వారము ||శృంగార||
చరణము 1
పాలును తేనెయున్ – బారేడి కానాను – ప్రదేశ భూములకున్ – ప్రవేశ పెట్టు ||శృంగార||
చరణము 2
యెరూషలేమాలయ – పరిశుద్ధ స్థలమందు – పరిశుద్ధ జనులుగ – ప్రవేశ పెట్టు ||శృంగార||
చరణము 3
అత్యంత పరిశుద్ధ – స్థలమందు మమ్ము – నిత్యంబు యాజకులుగాను చేర్చు ||శృంగార||
చరణము 4
ఇరుకైన నేమది – సరియైన ద్వారంబు – సంకటంబైనను – సౌఖ్యన చేర్చు ||శృంగార||