#474
యేసు కొరకే జీవింతును
పల్లవి · Pallavi
యేసుని కొరకై యిల జీవించెద – భాసురముగా నే ననుదినము –దోసములన్నియు బాపెను మోక్ష – నివాసమున ప్రభు జేర్చునుగా ॥ యేసుని ॥
చరణము 1
నాశనకరమగు గుంటలోనుండియు – మోసకరంబగు బురదనుండి – నా సచేనిలబెట్టెను నన్ను పి – శాత పదమును దొలగించెను ॥ యేసుని ॥
చరణము 2
పలువిధముల పాపంబును జేసితి – వద్దని ద్రోసితి వాక్యమును – కల్మషము బాపెనుకరుణను బిలిచెను – సిలువలో నన్నాలకించెను ॥ యేసుని ॥
చరణము 3
అలయక సొలయక సాగిపోదును – వెలయగా నా ప్రభు మార్గములన్ – కలిగెను నెమ్మది కల్వరిగిరిలో – విలువగు రక్తము చిందించిన ప్రభు ॥ యేసుని ॥
చరణము 4
శోధనలు బాధలు శ్రమలిల కలిగిన – నాదుకొనును నా ప్రభు వనిశం – వ్యాధులులేములు మరణము వచ్చిన – నాధుడె నా నిరీక్షణ యగున్ ॥ యేసుని ॥
చరణము 5
బుద్ధివిజ్ఞాన సర్వ సంపదలు – గుప్తమైయున్నవి – ప్రభునందు –అద్భుతముగా ప్రభు – వన్నియు నొసగి – దిద్దును నా బ్రతుకంతటిని ॥ యేసుని ॥
చరణము 6
అర్పించెను ధన ప్రాణము నాకై – రక్షించెను నా ప్రియ ప్రభువు – ఆర్పింతునునా యావజ్జీవము – రక్షకుడేసుని సేవింప ॥ యేసుని ॥
చరణము 7
ప్రభునందా నందింతును నిరతము – ప్రార్థన విజ్ఞాపనములతో – విభుడె తీర్చునిల నా చింతలు – అభయముతో స్తుతియింతు ప్రభున్ ॥ యేసుని ॥
చరణము 8
యౌవన జనమా – ఇదియే సమయము యేసుని చాటను రారండి – పావన నామము – పరిశుద్ధ నామము – జీవపు మార్గము – ప్రచురింపన్ ॥ యేసుని ॥