#472
ధన్యతలు
పల్లవి · Pallavi
వారు భాగ్యవంతులౌదురు – భూలోకమందు – వారు భాగ్యవంతులౌదురు – చారుశుభవార్తా రవంబు – గోరి యాకర్ణించి భక్తి – మీర దెలిసికొనినయట్టి – ధీరు లెవ్వ రెవ్వరో ॥ వారు ॥
చరణము 1
వారు నడుచు మార్గమందున – సుఖ క్షేమ రాజి – వారి ననుసరించునెందును – తేరి చూడరాని దే – దీప్యమాన దివ్య సత్య – భూరి తేజమాజనులను – బొలుపు మీర జుట్టుకొనును ॥ వారు ॥
చరణము 2
విమోచకుని నామమందున – ద్విజనంబుల – విశ్రుతానందంబు ప్రాణముల– యమందముగా హెచ్చరింప – నతని నీతి సృతి – జముల కోరకై వృద్ధి బొం – దంగ జేయు సంతతంబు ॥ వారు ॥
చరణము 3
నరుల భై పిశాచమును – నిందా స్థాప – నంబు చేయంగలేదు – పరగు– ప్రకాశమును – బ్రాపునైన సర్వ – శ్వరుడుబలము రక్షయున – వారితముగా మనకిచ్చు ॥ వారు ॥
చరణము 4
వరగుణ ప్రశస్తులారా – క్రైస్తవులారా – వెన్నెమీర మీ రాజుసురుచిరముగా శాశ్వతముగా – పరిపాలించుగాక దేవుడు – నిరతముగను జీవించు – నీతి భరిత చిత్తుడగుచు ॥ వారు ॥