#434

క్రీస్తు దాసుల సహవాసము

రాగం: బేహాగ్ · తాళం: రూపకము · రచయిత: డేవిడ్ లైటన్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు భక్తావరులతో నివాసముందము – యేసు దాసులౌదము ॥ యేసు ॥
చరణము 1
దోసములను దీగ లన్ని కోసివేతము – మిగుల మోసపుచ్చు నాశలన్ని రోసివేతము – యేసు దాసులౌదము ॥ యేసు ॥
చరణము 2
దోసిలొగ్గి ప్రభుని వేడ గాసి పడుదము – వాసిగాను యేసుమీద నాసపడుదము – యేసు దాసులౌదము ॥ యేసు ॥
చరణము 3
జార చోర దుష్కృత్యములు పారవేతము – సత్య సార మెరుగ పరమ గురుని జేరుకొందము – ఇక కోరుకొందము ॥ యేసు ॥
చరణము 4
ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును – యేసు శాపరాసులన్ని తానే యోపి మోసెను – తండ్రి దాపొసంగును ॥ యేసు ॥
చరణము 5
శరణుజొచ్చు నందరకును దురిత మెంచక – ఘోర మరణ బాధలెల్ల దీర్చి పరమొసంగును – స్థిర వరములిచ్చును ॥ యేసు ॥
చరణము 6
లోక భోగముల మదినన్ని రాకింతము – ప్రభు రాక కెదురు చూడ మనమేక మౌదము – ఇప్పుడు ఏకమౌదము ॥ యేసు ॥