#403

క్రీస్తు పేరట బాడుట

రాగం: ఆనందభైరవి · తాళం: ఆది · రచయిత: అల్లూరి పెద్దవీరాస్వామి

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పాడుదను క్రీస్తుపేర పదము – నెంతో – వేడెద నా దివ్యా గురుని విధము –చూడ జూడ మదిలో నెంతో – వేడుకగా మీరె వింత – రేడు పోలినవాడిహ – లేడు లేడందు నహహా || పాడుదను ||
చరణము 1
పెక్కు పాపములలోన మణిగి – నాదు – తక్కువ బుద్ధిచే నంత నణగి దిక్కు గానక నుండు వేళ – దిక్కరై చనుదెంచి మరల – గ్రహింప కరము ఈచి – చక్కటికి జేర్చి బ్రోచె || పాడుదను ||
చరణము 2
మోసపు లోక వాంఛలను – వట్టి – యాశలతో గూడుకొనిన కలలు రోసితిన గాన వాని – యేసుతో గూడుకొంటిని – వీసమైనను లేమి – లేశము లేదు స్వామి || పాడుదను ||
చరణము 3
పాయ నేనెన్నటికిని వాసిగా – బాస – ద్రోయను ద్రోయను అని చేసినగా – రోయక న న్నావిభుండు – సాయమై రక్షించు నెప్పుడు – నా యభీతి భయములు మాని – యా యన జయ జయమని || పాడుదను ||
చరణము 4
చాలు చాలు పాపమా నీ చెలిమి – నిత్య – కాలము గలిగించు మృత్యుకలిమి యేలికైన నా యిమ్మాను – యేలు నాయందు దయను – మేలవమి నగుపరచినట్టి – జాలినే గంటిగాన || పాడుదను ||
చరణము 5
ధరలో దేనికి భయపడను – ఎట్టి – తరుణమైనను చేయి విడువను – కరుణామయుండు నన్ను – కరుణ నేర్పరచి మునుపు మరణమందును వాని – శరణం నా శరణమని || పాడుదను ||