#402
దేవుడే మన దిక్కు
పల్లవి · Pallavi
దినదినముకు – దిక్కు నీవే – మా దేవుడా – మమ్ము కనిపెట్టి కాపాడు నెప్పుడు – కర్త వీవే కర్త వీవే || దినదినమునకు ||
చరణము 1
పనికిమాలిన వారము – పాపిష్ఠులము నీదు – కనికరమును ఈచి కృపతో – గావు మమ్ము గావు మమ్ము || దినదినమునకు ||
చరణము 2
పాపమైన లోకమైన పిశాచకమైన మమ్ము – బట్టి రక్షింప వచ్చిన – బ్రాపు నీవే ప్రాపు నీవే || దినదినమునకు ||
చరణము 3
కష్టములు – కాని శోధనలు మమ్ము – చుట్టుకొనగ నీ కృప నెంతో – చూపెదవే చూపెదవే || దినదినమునకు ||
చరణము 4
నిందలైన దెబ్బలైన – నీదు నామమున మేము – పొందబోవు కాలమందు తండ్రి వీవే తండ్రి వీవే || దినదినమునకు ||
చరణము 5
సత్యమైన వాక్యమిచ్చి – సారమును దెల్పి నీదు – నిత్యజీవ మార్గమందు – నిలిపితివే నిలిపితిве || దినదినమునకు ||
చరణము 6
ఆశగొల్పి యాత్మలో నాఖ్యానుభవ మొందించి నీకు – దాసులమై బ్రతుకునట్లు – ధైర్యమిమ్ము ధైర్యమిమ్ము || దినదినమునకు ||
చరణము 7
విశ్వాస నిరీక్షణ ప్రేమ – నింపుగా మాకు నీవు – శాశ్వతముగ బంపించుమీ – శ్రేష్ఠముగను శ్రేష్ఠముగను || దినదినమునకు ||