#399

క్రైస్తవాదరణ

రాగం: ముఖారి · తాళం: త్రిపుట · రచయిత: విలియం డానన్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
జగము నిన్ బట్టి – వెనుక నీడ్చి – పగ దీరగట్టి – యెగతాళి గావించు – టెరిగి క్రీస్తుని పిల్వ – డగబట్టు మప్పుడు నీ – పగ మానిపి విడిపించు || భయము ||
చరణము 1
కలుష జాలంబు – మాయా కటి – కముల జాలంబు గల బావి నీ యాత్మ – గలియకుండా యేసు – దలచుమప్పుడు నిం జే – తం బట్టి కాపాడు || భయము ||
చరణము 2
శ్రమ దండనముల – శిశు శిక్షించు – జనకు విధమున – సమకూర్చు నీ దేవు – డమిత ప్రేమను గాంచి – యమలమౌ మతి నోర్చు – మప్పుడు మేలిడు నీకు || భయము ||
చరణము 3
కన్నీటి చటల – దుఃఖాదుల – ట్లన్ను వీడునటుల – గొన దినమున న్యాయ – మును దీర్పగా క్రీస్తు – చనుదెంచి నిత్య జీ – వన కిరీటము నిచ్చు || భయము ||