#398

రేపటిని గూర్చి చింతింపకుము

రాగం: నాథనామక్రియ · తాళం: అట · రచయిత: మిక్కిలి సమూయేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
జీవమా చింతించకుండు – నిన్ను – గావ వచ్చిన యేసు కరుణామయుండుజీవమా చింతించి – కృతి మూర్ఛిలైన నీ – జీవముకు నమ్మి జేసెదవా – కావున నీ చింతా – క్రాంతము వెడలించు – దేవుడెహోవ నీ – దిక్కని నమ్మి || జీవమా ||
చరణము 1
గగన వీధిని బోవు – ఖగములు దున్నునా – తెగగోసి కొట్లలో – దాచునొకో – యగణిత పక్షుల – కాహార మియ్యంగ – బెగడెద వెందుకు – పెంచు నన్నతడు || జీవమా ||
చరణము 2
పక్షి వృక్షాదుల – పై నింత ప్రేమతో – భక్షణ ఇచ్చుచు – బాలింపగా – నక్షరములకంటె – హెచ్చుగ నన్నెంచి – యక్షయముగా నేలు – నల్పవిశ్వాసి || జీవమా ||
చరణము 3
మిస్రాయిం బాధల – మీర దొలగించి – యిస్రాయేలుకు – మన్నా – నియ్యలేదా – యాశ్రయమై నీదు – హస్తము విడువక – నీ శ్రమలను బాపి – నిన్నేలు నాతడు || జీవమా ||