#391
విశ్వాస విజయము
పల్లవి · Pallavi
విశ్వాసమే విజయము – విను ప్రియుడా యా – విశ్వాస మపజయమువిశ్వాసాయుధమైన – విసుకని సుకార్యములే – విశ్వాసవంతునికి – విజయమొసంగును నిజము || విశ్వాసమే ||
చరణము 1
భక్తుడం దువలననే – బ్రతుకును మరియు – శక్తినొంది నిల్చునుయుక్తముగా వర్తించి – యుక్తిని జయించి – ముక్తినొందునటంచు – రక్తిగా పాడుదను || విశ్వాసమే ||
చరణము 2
మంచి పేరు నొందును – సాతాను నెది – రించి విజయమొందునుమించిన బాధల్స – హించి జయించును – నంచిత మరణము – నానందముగ గాంచు || విశ్వాసమే ||
చరణము 3
ప్రవిమలమొందెదము – పాపమునుండి – పరిహరింపబడుదముఅవిరతమును మనము – నాశ్చర్యముగ ఘనము – భువి యందునన్ దివి యందునన్ – బుధులతో నొందెదము || విశ్వాసమే ||
చరణము 4
నీతిమంతుల మౌదము – నిశ్చయము ప్ర – ఖ్యాతి బోధను నేర్తుముఆ తండ్రి దత్తముల – నన్ని యాజించుచు – యాతని సుభద్రములో – ననయముందుము నిజము || విశ్వాసమే ||
చరణము 5
పరిపూర్ణ విశ్వాసమే – క్రియలతో నున్న – మరి మంచి విశ్వాసమేధరయందునన్ బరమందునన్ – ధన్యాత్మునిగ జేయున్ – సరగను నద్దానినే – సంపాదింపుము ప్రియుడా || విశ్వాసమే ||