#390
విశ్వాసమువలని విశ్రాంతి
పల్లవి · Pallavi
సందియము వీడవే – నా మనసా యా – నందమున గూడవేసందియము లింకేల నిను సుఖ – మొంద జేసెడు క్రీస్తు రక్తపుబిందువులు శుభవార్త వాక్యము – లందు గని తెలివొంది బ్రతుకుచు || సందియము ||
చరణము 1
చింతలింక మానము – లోకులు దెల్ప – భ్రాంతులు పడి బోకుముఎంత వింత దురంత పాపము – లంతటను దన రక్తమున గో – రంతలేక యెదురుచునని సి – ద్ధాంతమగు ప్రభు వాక్యమును విని || సందియము ||
చరణము 2
పాపములు వీడుము – నీ వినయ పశ్చా – తాపమున గూడుముఏపు మీరిన యోర్పుతో నొక – పాపి కైన లయంబు గోరక – పాపులందరు తిరిగి వచ్చెడు – కోపుగోరెడు కర్త దరి జని || సందియము ||
చరణము 3
నేరముల నెంచకో – యేసుని కరుణా – సారమున్ దలంచకోభారముల్ మోయుచు శ్రమన్ పడు – వారలందరు నమ్మి నా దరి జేర విశ్రమ మిత్తుననుప్రభు – సార వాక్యెలు చక్కగా విని || సందియము ||
చరణము 4
నిమ్మళము నొందుము – రక్షకుని పలుకు – నమ్ముకొని యుండుముఇమ్మహిని బాపులకు నైప – క్షము చేసి పరాత్పరుని సము – ఖమ్మునందు చిత్తముగా – కాయమ్ము బలియుడు నీ ప్రభుని గని || సందియము ||
చరణము 5
ప్రేమ దయా శాంతముల్ – కర్తకు భాషా – స్తోమములు అవంతముల్నీ మొరలివి యేసు నాధ – స్వామి తన రక్తమున బాపము దొమి నమ్మకలంకుగ – జేయును నీ మదిన దగ నమ్ముకొన రింక || సందియము ||