#388
విశ్వాస ప్రార్థన
పల్లవి · Pallavi
విశ్వాసముతో – వేడెడి వారికి – విశ్వమంతయును – వీల్పడునుశాశ్వత రాజ్య – దీశ్వర మేధావీశ్వరుండు – શાశ్వతమగు నీ – శాసన మిచ్చెను || విశ్వా ||
చరణము 1
బిడ్డలు తండ్రుల – వేడగ నన్నము – బెడ్డలు ఇచ్చు వె – రులు గలరేదొడ్డ తండ్రి నిలన్ – దొడ్డార అడిగిన – నుల్లము లేక విమ – లాత్మ నొసంగును || విశ్వా ||
చరణము 2
నమ్మకమునన్ – వడెడు నరులను గానము – నమ్మక చెడుదురు – నరులయ్యోఇమ్మహి సకల శు – భమ్ములు గలుగును – సమ్మతి వెదకగ – శాశ్వత రాజ్యము || విశ్వా ||
చరణము 3
వెతకెడు వారికి – వెసన కృప జూపును – గతి గని వేడం – గా దెరచున్సతతము యేసుని – చక్కని పేరట – హిత మతి వేడగ – నెంతయు మేలగు || విశ్వా ||
చరణము 4
బలమేమియున్ – గనన్ – బడు దాహనే సలిపెడు భక్తుని – సతిమనుచునలయకు నేలను – నావగింజ మరి నిలిపిన జెట్టెరు – నింగిక నెదిగెద || విశ్వా ||
చరణము 5
అవిశ్వాసమున – నతి భీతులచే – నవిసి క్రుంగ నగు – నే మనసాభువిని బాపాత్ముల – బ్రోచెడు ప్రభు కృప – జవి జూడుము నుతి – సల్పుచు వేగమే || విశ్వా ||