#372

ప్రభు ప్రార్థన

రాగం: ఆనందభైరవి · తాళం: ఏక · రచయిత: విలియం డానన్

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఓ మా తండ్రి నీదు నామము – నిత్యమెన్నున్ – చుండుగాక సకల లోకముక్షేమముగను విమలముగను – జెనున్ మిరుగ బరలోక – ధాముడవై వెలయునట్టి – ధన్య సౌజన్యమాన్య || ఓ మా తండ్రి ||
చరణము 1
నీ రాజ్యంబు రా నిమ్ము – నీదు చిత్తము – నేటుగ బరలోకమందుననే రీతిగను చేయంబడునో – యీ భూలోకమందునట్టి – దారి బొంద జేయవలెను – ధర్మమూర్తి సత్యవర్తి || ఓ మా తండ్రి ||
చరణము 2
నేటి యాహారంబు మాకు – గరుణ చేసి – నేటి కిచ్చి సూటి పరచుమిమేటి మా విరోధి జనుల – మే మెట్లు క్షమింతుమటుల – మాటికనికి క్షమింప నీవే – మాకు వేరే లేరు సుమ్ము || ఓ మా తండ్రి ||
చరణము 3
మమ్ము శోధనమునకు తేకుము – కీడు నుండి – మరల జేయు మమ్ము నేమనెన్ఇమ్మగు బల మహిమ రా – జ్యమ్ములును సర్వకా – లమ్ము నీవే మాదు ప్రార్థ – న నమ్ము జేకొమ్ము ఆమెన్ || ఓ మా తండ్రి ||