#338
పాపము మీది క్రీస్తుని విజయము
పల్లవి · Pallavi
యేసుడు రాగలన్ – చేసిన దోషము నాశనమాయెన్ || యేసుడు ||
చరణము 1
చింతలు పోయెన్ – వింతగ నాకున్ చెంతకు జేర్పగ – సంతసమాయెన్ || యేసుడు ||
చరణము 2
సిలువను మోసెన్ – గొలగరి మెట్టన్ చెలువగ బాపన్ – బరువును దించెన్ || యేసుడు ||
చరణము 3
శిరమున ముండ్లన్ – గరమున మేకులున్ స్థిరముగ నాటగ – బరమును జూపెన్ || యేసుడు ||
చరణము 4
పదముల మేకులున్ – జెదరగ రక్తము ఎదనిక ప్రేముతో – ముదము నొసంగెన్ || యేసుడు ||
చరణము 5
రక్షణ జూపెన్ – దక్షుడు నాకున్ పక్షముతో నిక – మోక్షము జూపెన్ || యేసుడు ||
చరణము 6
రక్తిగ వేడన్ – शक्ति నొసంగెన్ రక్తము జల్లియు – ముక్తిని జూపెన్ || యేసుడు ||
చరణము 7
గురువును నమ్ముదున్ – భారము వెడలెన్ నేరుని జేయుచు – దారిని జూపెన్ || యేసుడు ||