చరణము 1
యేసు, నీదు జాలివలన లెక్కలేనివారలు రక్షణపొంది సంతోసిల్ల నిమ్ము వారి డెందములలో నీదు సిలువ వింతవార్త చాటజేసి రాష్ట్రములు చూడనిమ్ము త్రాణకర్త! నీ కృపా ప్రకాశములలో.
చరణము 2
ఏమియును గ్రహింపకున్న మర్త్య డెందమవశతో నిన్ను గూర్చి తృష్ణ గొన్న యాత్మ యేడుచు మెండుగా కోయబడ్డ గడ్డి యెండనట్లు పాపులు నీవే రక్షకుండ వంచు నిన్ సదా యాశింతురు.
చరణము 3
ద్వీపవాసులెత్తి చేలు కోరుచుందు రిప్పుడు నీదు సేవకాళి నంపి యాత్మ క్రొత్త జన్మమును ప్రేమదీప్తి జ్ఞాన కాంతి గలంగజేయు వాక్యము నిచ్చి గొర్రెపిల్ల కీర్తిని వారి నోట నుంచుము.