పల్లవి · Pallavi
అపరాధిని యేసయ్య – కృప చూపి బ్రోవుమయ్యానెపమెంచకయే నీ కృపలో – నాపరాధములను క్షమించు ॥అపరాధిని॥
చరణము 1
సిలువకు నిన్ను నే గొట్టితిని – తులువలతో జేరితిని – కలుషంబులను మోపితిని – దోషుండనేను ప్రభువా ॥అపరాధిని॥
చరణము 2
ప్రక్కలో బల్లెపు పోటు – గ్రుక్కున బొడిచితి నేనే – మిక్కిలి బాధించితిని – మక్కువ చూపిన వయ్యా ॥అపరాధిని॥
చరణము 3
ముండ్లతో కిరీటంబు – నలిపి నీ శిరమున నిడి – నా వల్ల నేరమాయె – చల్లని దయగల తండ్రి ॥అపరాధిని॥
చరణము 4
దాహంబు కొనగా చేదు – చిరకను ద్రావనిడితి – ద్రోహుండనై జేసితి నీ – దేహంబు గాయంబులను ॥అపరాధిని॥
చరణము 5
ఘోరంబుగా దూరితిని – నేరంబులను జేసితి – క్రూరుండనై గొట్టితిని – ఘోరంపు పాపిని దేవా ॥అపరాధిని॥
చరణము 6
చిందిన రక్తంబు నాకై – పొందిన దెబ్బలచేత – నిందలు బెట్టితి నయ్యా – సందేహమేలనయ్యా ॥అపరాధిని॥
చరణము 7
శిక్షకు పాత్రుడనయ్యా – రక్షణ దెచ్చితివయ్యా – అక్షయ భాగ్యము నీయ్య – మోక్షంబు జూపితివయ్యా ॥అపరాధిని॥