#330
పాపమును విసర్జించుట
పల్లవి · Pallavi
ఖండింపవలెను – దుర్గుణములు – ఖండింపవలెను – ఖండింపవలెనే పాపముండ – నియ్యక యేసు – నుండ జేరి మన – గుండె పదిలము చేసి ॥ఖండింప॥
చరణము 1
అంధత్వమునను – రక్షణ మార్గ – మంద జేరకయు – నెందెందు చూచినా – సందేహము లేక పాప – మందు మునిగి నరలా – నందమొందక చెడిరి ॥ఖండంప॥
చరణము 2
ఎందుకీ భ్రమలు – నీ యందుండు – సంశయము వీడు – పొందుగ యేసు సం – బంధుడవై యున్న – నందమైన మోక్ష – మందు జేరుట కొరకై ॥ఖండింప॥
చరణము 3
బెదరక నీవు – సాతానుని – నెదిరింపవలెను – కుదురుగ నీ యేసు – చదరున జేరిన – వదరుబోతు లెల్లా – నెదురాడ లేరింక ॥ఖండింప॥
చరణము 4
ఆసింపబోకు – లోకభోగములు – మోసమై యుండు – వాసిగ యేసుని – దాసుడవైనట్టి – గాసి జెందక మోక్ష – దాసుడ వౌదువు ॥ఖండింప॥
చరణము 5
నమ్మి జీవించు – యేసుని యందు – నెమ్మది బొందు – రమ్ము యేసుని యొద్ద – సొమ్ము నీకున్నది – సమ్మతించి మదిని