#316

పాపపు టొప్పుకోలు

రాగం: కేదారగౌళ · తాళం: ఏక · రచయిత: చికాల పాల్స్

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
దిక్కు లేనివాడనో ప్రభో – నీ యండజేరి – మ్రొక్కి సేవ జేతునో ప్రభో – మ్రొక్కి విన్నవించు వారి – యక్కరలను దీర్చు సత్యము – గ్రక్కున నిడి యాదరించు – మక్కువైన దేవతనయా ॥దిక్కు లేని॥
చరణము 1
ఘోర పాప భరము నెల్లను – మోయుచు నలయు – వారలారా రండటంచును – భూరి దయను బిలచి యున్న – సార వాక్కు లెరుగు కధిక – భార మొంది తుదిని నీ దరి – జేరితి నన్నాదరించుము ॥దిక్కు లేని॥
చరణము 2
బలము లేనివాడనో ప్రభో – కేవలము పాప – ములను జేసి యలసితిని ప్రభో – ఇలను నే నొనర్చునట్టి – కలుష జాలములను నీవు – తొలగజేసి యాత్మ కధిక – బలము నొసగి మనుపుమయ్య ॥దిక్కు లేని॥
చరణము 3
పామరుడనౌట వలనను నే నెరుంగనైతి – క్షేమ మిచ్చు పదవులెల్లను – కామ క్రోధ లోభములను – దీమసమున విడిచి యేసు – నామమందు విశ్వసించి – ప్రేమను వర్తింపజేయు ॥దిక్కు లేని॥
చరణము 4
వందనమొనర్తునో ప్రభో – నా డెందమందలి – సందియము లణచుమో ప్రభో – సందియము నెడబాపి శాస్త్ర – మందు నుండు సార వాక్యానంద పదవులనుభవింప – డెందము వెలిగింపుమయ్య ॥దిక్కు లేని॥