#315

ఉన్న విధముననే నీ యొద్దకు వచ్చుచున్నాను

రాగం: ముఖారి · తాళం: త్రిపుట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఉన్నపాటున వచ్చు – చున్నాను నీ పాద – సన్నిధి కొరకు రక్షకా – యెన్న శక్యముగాని పాపము – లన్ని మోపుగ వీపుపై బడి – యున్న విగ నడువలేక తొట్రిల్లు – చున్నవాడను నన్ను దయ గను ॥ఉన్నపాటున॥
చరణము 1
కారుణ్యనిధి యేసు – నా రక్షకా నీ శ – రీర రక్తము చిందుట – భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని – ష్రారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ॥ఉన్నపాటున॥
చరణము 2
మసిబొగ్గువలె నా మా – నసమెల్లా గప్పే దో – ష సమూహములు మచ్చలై – నల్లని ప్రతి దాగుడును వన – గసియుండు గడిగి పవిత్ర పరపను – నా సువు లీడు నీ రక్తమే యని – మసల కిప్పుడు సిలువ నిదె గని ॥ఉన్నపాటున॥
చరణము 3
వెలుపట బలు యుద్ధ – ములు లోపటను భయము – గెలిగె నెమ్మది తొలగెను – పలు విధములగు సంశయంబుల – వలన పోరాటములచే నే – నలసి యిటునటు గొట్టబడి దు – ర్బలుడనై గాయములతో నిదె ॥ఉన్నపాటున॥
చరణము 4
మిక్కిలి బీదవాడను గుడ్డివాడను దౌర్భాగ్యుడను – జెడిపోయి పడియున్నాను – సొమ్మసిల్లిన నా మదికి స్వస్థత – జెడిన కన్నులకు దృష్టి భాగ్యము – బడయవలసినవన్నీ నీ చే – బొందుటకు నా యెడ యెడ యిదె ॥ఉన్నపాటున॥
చరణము 5
నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని – కేవలంబుగ ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని – భావశుద్ధి యొనర్చి సంతోషావసరముల నిడుదవని యిదె ॥ఉన్నపాటున॥
చరణము 6
దరిలేని యానంద – కరమైన నీ ప్రేమ – తరము వర్ణన చేయను – తెరువు గడ్డంబైన యన్నిటి – విరుగ గొట్టితివి గాన నే నిప్పు డరుదెంచెదగా నీ వాడ నవుటకు – మరి నిజము నీవాడ నవుటకే ॥ఉన్నపాటున॥