#300
వచ్చి క్రీస్తును చూడండి
పల్లవి · Pallavi
రారే యేసుని చూతము – కోరిక దీర – రారే యేసుని చూతము – రారే యేసుని చూడ – రారాజై మన జీవ – ధార కరుణామృత – సారమై యున్నాడు ॥రారే॥
చరణము 1
సారహీన మగు సంసారాబ్ధిలో చిక్కి – భారమనుచు నీత – నేరని వారికి తారకమైన దేవుకు – మారుడు యేసుడు ఆదరించుచుండుటకు – భూరి సహాయ – కారియై చేయూతకు – గోరి యిచ్చుచు క్షేమ – తీరంబునకు జేర్చ – దారి జూపుచు మా వి – చారముల్ దొలగించు ॥రారే॥
చరణము 2
ఘోరమైన పాప – భారంబు మోయుచు – దారి గానక తారు – మారులైన నరుల – గారిమితోడ బిలుచును – నారక బాధ – లూరక దొలగించుచు – నీరసులం చు భారంబు తా మోయుచు – నోరి మధికము జూపి – నేరంబు బాపి శృం – గారమైన మోక్ష – ద్వారమై యున్నాడు ॥రారే॥
చరణము 3
కారుణ్యుడును నిశ్చి – కారుణ్యుడు దురితోప – కారుండు శుద్ధాలం – కారుండౌ యేసుని – నే రీతిగా వింటిమో – యా రీతి మో – క్షారామమున జూతము – సారవాక్య – ధోరణిన్ బడి పోదము – దారుణం బగు శ్రమలు – బారు బారుగా నున్న – పోరి దాటి ప్రభుని – జేరి సుఖింతము ॥రారే॥
చరణము 4
ఆ రమ్యపురిని బ్రే – మార్గించుచు నిత్యము – ఆరోగ్యముకు బొంది – సారెసారెకు ప్రభుని – నాదారముగ స్తోత్రము – చారుతర దే – వారాధనము జేతము – నోరార నా – పేరు నే పూజింతుము – దూరస్థులై యున్న – వారలందన రక్త – ధారోదకముచే జే – కూరునట్లుగ జేయు ॥రారే॥