#299

యేసునాథ కథా మాధుర్యము

రాగం: బిలహరి · తాళం: త్రిపుట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు నాథ కథ సుధారస – మిదిగో పానము చేయరే – దోషకారి జనంబులారా – దురిత భవములు బాయరే ॥యేసు॥
చరణము 1
ఇహపరంబుల నిచ్చు సృజి – యింపబడెనో చూడరే – అసహాయ విభుడవతరించెను – అతని గుణములు పాడరే ॥యేసు॥
చరణము 2
దురిత భరితుల దుష్ట చరితుల – నరయ వచ్చెను చూడరే – స్థిరముగా మది నమ్మి యా ప్రభు – కరుణ మది గొనియాడరే ॥యేసు॥
చరణము 3
పనికిమాలిన వేల్పుల దెస – పరుగు లెత్తుట మానరే – తనువు మీ కొర కిచ్చు క్రీస్తుని – దయకు పాత్రత బూనరే ॥యేసు॥
చరణము 4
మరణ బలి రక్తమున మన యం – దరిని బ్రోవను వచ్చెను – కరుణతో పాపుల బిలుచు గురు – దరికి బోవుద మిచ్చెను ॥యేసు॥
చరణము 5
పరమతత్వ విధాన బోధలు – బాగుగ బ్రకటించెను – చిరసుఖాస్పద పదము గోరిన – జీవులకు వినిపించెను ॥యేసు॥
చరణము 6
మరణమొందిన కొందరికిని దా – మరల ప్రాణము లిచ్చెను – వర మహదాద్భుత కార్యములు ని – ద్ధర ననేకమొనర్చెను ॥యేసు॥
చరణము 7
కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన – గోష్ఠి నుండుట గోరరే – దిటముగాను నెమ్మదిని మీరొం – దుటకు క్రీస్తుని జేరరే ॥యేసు॥