#297

యేసు క్రీస్తును గొలుచుట

రాగం: ముఖారి · తాళం: ఆది · రచయిత: గొల్లపల్లి నతానియేలు

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు క్రీస్తుని గొల్వ రన్న – ఈ జగతి లోన – నెవ్వరు లేరు వానికన్న – యేసుని వాక్యము – ఎవ్వరి కబ్బునో – దోషము విడిచి పర – వాసము దొరకును ॥యేసు॥
చరణము 1
సత్యుండు నిత్యుండాయనన్న – ఈ సర్వ సృష్టి – చక్కగా సలిపి నిలిపినాయనన్న – వ్యత్యాసము లే – మియు లేకుండా – సత్యుండు చేసెను – సర్వ జగంబును ॥యేసు॥
చరణము 2
నిరాకారుడు నిశ్చయుండన్న – నరుల రక్షింప – నరావతారుడైనాడన్న – నరుల పాపములు – పరిహరించుట – కొరకై మరియ కొడుకై పుట్టెను ॥యేసు॥
చరణము 3
పరిశుద్ధవంతుడాయనన్న – ప్రభు యేసు నందు – పాపమే గానబడుట సున్న – పరులను గావను – ధరలో దిరిగెను – నరుల నడుమ బహు – నిరపరాధముతో ॥యేసు॥
చరణము 4
భేదాభేదములు గాని బోధ – నాథుడొనరించె – సాధు లెల్లను సంతోషింప – బాధలు పడు స – ద్రిక్తులతోడను – సాదర వాక్కులు – చక్కగా బలికెను ॥యేసు॥
చరణము 5
మహిలో మనుజు లెవ్వరైన – చేయలేనట్టి – మహిమాద్భుతములు చేసెనన్న – మహారోగులను – మరి మృతులను మహా – మహుండు స్వస్థత – మరి గావించెను ॥యేసు॥
చరణము 6
వర్ణింపవలను కానివాడు – మన కోసర మతడు – మరణమై మరల బ్రతికినాడు – పరలోకమునకు – మరి వేంచేసిన – పరుండగు క్రీస్తుని – పాదము బట్టుము ॥యేసు॥
చరణము 7
పరిశుద్ధ దూతల నాదముతో – ప్రభు యేసు క్రీస్తు – ప్రకాశ వస్త్ర మహిమలతో – పరమునుండి బహు – త్వరగా వచ్చును – ధరలో నమ్మిన – నరులను బ్రోచును ॥యేసు॥
చరణము 8
న్యాయంబు తీర్చు దినము గలదు – నమ్మని వారెల్లా – సాయంబు వెదకినను గనపడదు – సువార్త న్యాయము – తీర్చును – నడ వడి చొప్పున – నమ్మని పాపుల – నరకము చేర్చును ॥యేసు॥
చరణము 9
నమ్మండి నష్టము నొందక – యేసుని నమ్మిన – పొమ్మని చెప్పడు సుమ్మండి – ఇమ్ముగా కృపతో – నిలలో గాచును – పిమ్మట మోక్ష పురమున – జేర్చును ॥యేసు॥