#283

పరిశుద్ధ సమభక్తిత్వము

రచయిత: సమూయేలు పాక్యనాథము

Category: ప్రభు రాత్రి భోజనము · Open in the hymnal app

పల్లవి · Pallavi
స్తోత్రార్పణ నర్పింతము – జప – ధూపము వేసి కీర్తింతము – పాత్రుండైన శ్రీ యేసుండు – పరమ – భోజనాంశమైనందున ॥స్తోత్రార్పణ॥
చరణము 1
కృతజ్ఞతా స్తోత్రంబులన్ – దేవ – కృపార్థమై చేయుదము – క్షితి నా తండు బలి యియ్యన్ గాన్ – బుట్టె – నూతనంపు నిబంధన ॥స్తోత్రార్పణ॥
చరణము 2
పాపములన్ని హరించెను – మా – ప్రభువగు యేసు సురక్తము – ఏపుగ దీన్ని దలంచుచు – నిక – నెన్నడు యేసుని భజింతము ॥స్తోత్రార్పణ॥
చరణము 3
చావునుండి రక్షించెను – స – జీవులలో లెక్కించెను – దేవునికి నిక నర్పింతము స – జీవార్పణ బలిగను ॥స్తోత్రార్పణ॥
చరణము 4
పుణ్యరక్త శరీరల – లో – పాలొందు మన మందరము – అన్యులము కానేరము – దై – వానోన్యంబు నొందినాము ॥స్తోత్రార్పణ॥
చరణము 5
మరణ శ్రమల స్మరింతము – ప్రభు – తిరిగి వచ్చు పర్యంతము – ధరణి నా యేసు మరణంబును – ఇంకను జిరకాలంబు చాటింతము ॥స్తోత్రార్పణ॥