#268
సభ కాపరుల కొరకు ప్రార్థించుట
పల్లవి · Pallavi
పరిశుద్ధాత్ముడా, లెమ్ము నీ – సంఘముపై నీ – వర దీవెన లంచుము చిరుత కాలపు సభ కా – పరులొంది నీ యగ్ని – యరుల నెదిరించి చా – టిరి నీదు సత్యంబు ॥పరి॥
చరణము 1
బలుడాయీ కాలంబునన్ – దివారాత్ర – ములు నీదు సేవకులను – నలు దిక్కులను దిరిగి – విలసిల్ల నీ వార్త – పలు జనాంగములకు – బ్రకటించుచుందురు ॥పరి॥
చరణము 2
ప్రతిదేశము కిప్పుడు – ఉజ్జీవము – బడసి నీ బిడ్డలు – అతులుండు నీ పుత్రున్ – రాజ్రాపించిన యట్లే – యతి తీవ్రతను వేడ – జక్రాధిప మాకొసంగమయ్యా ॥పరి॥
చరణము 3
పరిశుద్ధాత్మ బలంబును – వాక్యపు ధృతిని – బడసిన బోధకులను – ఇరుల శక్తిన ద్రోసి – నరులను నీ తట్టు – మరల జేసెడు వారి – ద్వారలో బంపుము దేవ ॥పరి॥
చరణము 4
నీ యాత్మ కాంతితోడ – పూర్వము వలెనే – డాయంగ మము జేయుమా – ఏ యేడనుండునట్లున్నను బాసి – యెలమి నింగిని చీల్చి – దాయుము మము స్వేచ్ఛ – దయచేసి నీ యొద్ద ॥పరి॥
చరణము 5
జనులెల్ల నీ వాక్యపు – శక్తి నెరిగి – ఘనపరపన ద్వారచేయుము – పెను సంఘములు లోక – మున నాటి యిశ్రాయేలు – జనపు నిద్రను బాపు – జయమొందు నీ వాక్కు ॥పరి॥
చరణము 6
ఇల సంఘమున నెడారులు – కప్పుము దేవ – తొలగించుమటంకము – అల నీ వాక్యమునకు – నడ్డంబు లేమియు – గలుగుకుండగ నిమ్ము – ఘన సంఘాధ్యక్షుండ ॥పరి॥
చరణము 7
నీ సంఘమును నబద్ధ – బోధలనుండి – నిర్మలంబుగా గావుమా – గాసి జేసెడు జీత – గాండ్లను బాపి నీ – భాసిల్లు నుద్యాన – వనముగా నుంచుమా ॥పరి॥