#267
సువార్తికుల ఘనత
పల్లవి · Pallavi
ఎంతో సుందరమైనవి – ధర గిరులపై – నెంతొ యందమైనవి – సంతతంబు పరమ – జనకు ప్రేమను దెల్ప – సంతోసమందుచు – సరిగ బ్రకటన చేయ ॥ఎంతో॥
చరణము 1
మందమతులుగువారలు – మూర్తత్వంబు – నొందు నెల్ల జనంబులు – వందుచు గుందుచు – వన గిరి కందరము – లందునున్న సకల – మౌనమోటుజన మెరుంగ – పొందుగా ప్రభు యేసుసొంగెడు – సుందరంబగు సత్యవాక్యం – బందుకొని చాటించుచుండెడు – అందమగు బోధకుల పాదము ॥ఎంతో॥
చరణము 2
మదిలో ప్రభుని నమ్మిన – పాపుల నెల్ల – తుదకి మోక్ష పదమున – విదితముగా జేర్చి – ప్రీతిని జూపున టంచు – ఇదిగో రమ్మని క్రీస్తు – పద సన్నిధిని జేర్ప – సదయులై శుభవార్తమానము – ముదమునను మదిలోన నిడికొని – పదిలముగా బ్రకటించుచుండెడి – విదితులుగు బోధకుల పాదము ॥ఎంతో॥
చరణము 3
యేసు క్రీస్తు రారాలై – యున్నాడునుచు – భాసురంబుగా దెల్పుచు – వాసిగా ప్రభు యేసు – వసుధ రక్షకుడనుచు – ఈ సువార్తను చాటి యిచట నెమ్మదినొంద – దురితకారి జనంబు లందరి – కేసు మంగళ వార్త దెల్పుచు – దురితమంతయు బాపు మన ప్రభు – యేసుని జూపెడు వారి పాదము ॥ఎంతో॥