#265
Glorious Things of Thee are Spoken
పల్లవి · Pallavi
దేవుని సీయోను పురమా!శ్రేష్ఠమౌ పట్టణమా!స్థావరంబైన పురమా!దేవుని నివాసమా!యుగముల శిలయైన దేవుడే నీ పునాది! శత్రువు జయించలేని రక్షణ నీ దుర్గము.కాంచుమా సజీవధారల్శాశ్వత ప్రేమధారల్నీదు పుత్రికా పుత్రులన్తృప్తిపరచు ధారలన్అలసి సొలయకుండా దాహమున్ దీర్చుధార దాతయౌ దేవుని కృప సర్వకాలంబు పారున్.కాంచుమా నీ యిండ్లమీదఅగ్ని మేఘంబులిద్దెప్రభుని రాక సమయం బని మహిమ దెల్పే!ప్రార్థన ఫలంబిచ్చి మన్నా నిచ్చిన ప్రభు సింహాసనాసీనుడై సునాదుస్తోత్రంబుల్ వినెదన్.