#262
క్రైస్తవ సంఘ బాధ్యతలు
పల్లవి · Pallavi
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును – పరిమళ వాసనగానుండ – ప్రభువు చిత్తమును పరిగణించుటయే – సంఘము నీ బాధ్యతగాదా! ॥ప్రభు॥
చరణము 1
దేవుడిచ్చు బహుమానమే బిడ్డలు – గర్భఫలమే మన కిడు స్వాస్థ్యం ఇంపుగ బ్రతిష్టింపను వారిని – సంఘమా – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
చరణము 2
యువకులు రేపటి సంఘము నందున – నాయకులుదురు నయముగాను పావనులుగా నిల జేయను వారిని – సంఘము – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
చరణము 3
బాప్తిస్మమును కృపా ప్రసాదములు – ప్రభు వించెను పరిశుద్ధముగా ఘనముగా వాటిని గైకొన నిరతము – సంఘము – నీ బాధ్యతగాదా! ॥ప్రభు॥
చరణము 4
దేవుడు జతపరిచిన దాంపత్యము – భావములర బంధుత్వములున్ – సవ్యముగాసరి చేయగ వాటిని – సంఘమా – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
చరణము 5
పామర జనములు ప్రభు నెరుంగక – పెడ మార్గంబుల దిరుగగను – మానుగ రక్షణమార్గము జూపుట – సంఘమా – నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
చరణము 6
క్రైస్తవ దాతృత్వము నందెదుగుట – కర్తను కీర్తించుట యౌను – దశమ భాగములు దాత కొసంగను – సంఘమా – నీ బాధ్యత గాదా? ॥ప్రభు॥