#261

ఐక్యత

రాగం: ఖరహరప్రియ (ఛায়: తనయ క్రమములకు) · తాళం: ఆది · రచయిత: సెరెళ్ల సమూయేలు సుబ్బయ్య

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
సమకూర్చుము తండ్రి – క్రైస్తవ – సభలో నైక్యతను – ద్వారలోన – దేవ ప్రియ కొమారుడు – శ్రమలకు మునుపు – బమితాసక్తితో – నడిగిన విధమున ॥సమ॥
చరణము 1
దేశము రక్షణకై – తండ్రి – దేవుని మహిమార్థం – నిజముగా వాసిగన్ గూర్పను – భాసుర ఐక్యం – బాశతో నిన్నిట – నడుగుచునుండగా ॥సమ॥
చరణము 2
యేసుని నామమున – మమ్ములను – నేకముచేయుమింక – తండ్రి – నీ సిలువను చూచుచు మేమిలలో – వాసిగ ప్రేమతో – వర్ధిల్లుటకై ॥సమ॥