#259

సంఘము క్రీస్తుని దేహము

రాగం: ఆనందభైరవి (ఛాయ: ఓ మా తండ్రి) · తాళం: ఏక · రచయిత: పట్టాభి ప్రసంగి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు దేహమైన సంఘము – ప్రభు క్రీస్తుపై వి – శ్వాస మమరి క్రా లెడు జనము – యేసు ప్రాయశ్చిత్త రక్తము – దోషములను బాపు నంచు – నా సతోడ నమ్మి తమ ప్ర – యాసములను దీర్చుకొన్న ॥యేసు॥
చరణము 1
స్థాపకుండు యెహోవా దేవుడు – పాపులను గావ – నోపి సుతుని బంపె కరుణుండు – ఈ పవిత్ర సంఘమునకు – దీపము పరిశుద్ధ వేద – మేపుమీరు శిరసు క్రీస్తు – కాపుకర్త పావనాత్మ ॥యేసు॥
చరణము 2
వరుడు క్రీస్తు యేసునాథుని – మురువంపు వధువై – పరగు నహ విశేష ఖ్యాతిని – సరిగ బెట్టు నార్చిర – లరయు నీతి న్యాయము లవి – యురుతరాభరణముల సుం – దరము భక్తి వర్తనంబు ॥యేసు॥
చరణము 3
తన యమూల్య రక్తము తెచ్చి – యనురక్తుడైమె – కనిశ శుల్క దానమునిచ్చి – ఘనుండగు నా పావనాత్మ – తనకు తోడుచేసి మంచి – పinitన తత్వమున నీమెకొక్క – భవనము కట్టంగ బోయె ॥యేసు॥
చరణము 4
మరణ విజయుడైన వీరుడు – మహా బ్రమల పై – నరుగుదెంచు మహిమ శూరుడు – నిరత ప్రేమ కాముడౌను – కరముబట్టి పెండ్లి యాడి – ద్వరగ వచ్చు గాన భక్తి – పెరుగు బ్రతుకుటుత్తమంబు ॥యేసు॥