#258

సంఘము

రాగం: మధ్యమావతి · తాళం: ఆది · రచయిత: సెరెళ్ల సమూయేలు సుబ్బయ్య

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యెహోవా పురి పునాది – ఇల – మహా స్థిరమైనదిమహా సీయోను గుమ్మములు – అవి – యెహోవాకు నతిప్రియములు – ఇంక – నిహ జను లెల్లరు కొనియాడి – నిన్ను – బహు కీర్తింతురు పట్టణమా ॥యెహోవా॥
చరణము 1
భూమిలో సర్వ జనాంగముల్ – తమ – నామము లచ్చట వ్రాయగన్ – ఆ – స్వామి యెహోవా వారిన్ – అట – జన్మించిరని వ్రాయగన్ ॥యెహోవా॥
చరణము 2
పాటలు పాడి జనాంగమా – తమ – యూటలు నీ కడ గలవే – యని సన్నుతింతురు నిన్ను సన్నుతిపాత్రా – ఇంక – భజింతురు నిన్ను నిజభక్తిని ॥యెహోవా॥
చరణము 3
ఇది క్రైస్తవ సంఘంబే – కడు – శుభముల నిచ్చు స్థలంబే – ధర – బుధులు యేసుని నిటు గనుచు – నతి – ముదమును బొందుట నిజమే ॥యెహోవా॥
చరణము 4
జనకు కుమారాత్మకును – ఇంక – పునమహిమలు గల్గునుగాక – ఆ – దీన్ని నుండిన రీతిని నిప్పుడు – ఇంక – ననవరతముండును ఆమేన్ ॥యెహోవా॥