#255
దేవుని వాక్యానందము
పల్లవి · Pallavi
సుఖ మిచ్చె గద మాకు – प्रभु యేసువా నీ – సురుచిరమగు వాకు – నిఖిల కల్మష వనమునకు దవ – దహన శిఖల వలె గాల్చు నీదగు – ముఖ వికాసిత వాక్యములు బహు – సుఖము లొసంగుట వాన శ్రితాళికి ॥సుఖ మిచ్చె॥
చరణము 1
జగతి లోపల మెండుగా – నుండిన వివిధ – మగు శాస్త్రములు జూడగా – మిగుల గందరగోళమై మరి – యొక్కటి కొక్కటి విరుద్ధముగ మ – ర్త్యగణ కల్పిత మగుచునున్నవి – తగనివని ద్రోచితివి వాటిని ॥సుఖ మిచ్చె॥
చరణము 2
నీ వాక్యముల భావము – నమ్మిన పాపి – జీవుల కది జీవము – కేవలంబగు ధర్మశాస్త్రము – దేవుడిచ్చిన దొక్కటి బైబిలు – ఈ వసుధన గల సర్వ పాపులన్ – బ్రోవ వచ్చిన నిన్ను జూపెను ॥సుఖ మిచ్చె॥