#120
రక్షకుని రాక
పల్లవి · Pallavi
చూడరే మారేడు – పుట్టి నాడు బేత్లెహేములో – నేడు భూమి వాసులకు నిండు రక్షణ బెను ||చూడరే||
చరణము 1
ఎన్నరాని దైవ దీప్తి మునుపు మిన్ను గ్రమ్మెను – పన్నుగా రేయెండ కాంతి కన్నది మించెను ||చూడరే||
చరణము 2
దూత తెల్పె వ్రేలకొక్క ప్రీతియగు ముచ్చటలన్ ఖ్యాతిగ దావీదు పురిని కర్తయ యేసు పుట్టుటకన్ ||చూడరే||
చరణము 3
తూర్పున జ్ఞానులొక్క తార దివిని గాంచిరి – వారు వీరు వచ్చి సేవ వరుసగాను జేసిరి ||చూడరే||
చరణము 4
మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవ జేతము – మిక్కుటముగా మనకు శాంతి గ్రక్కున నొసంగును ||చూడరే||