#119
యేసు లోకమునకు వెలుగు
పల్లవి · Pallavi
లోకమంతట వెలుగు ప్రకాశించెను – యేసు జన్మించినప్పుడు – ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టినప్పుడు – లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లోక||
చరణము 1
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను – చీకటి దాని గ్రహింపలేదు – నేను లోకమునకు వెలుగైయున్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగైయుండుననె యేసు ||ローカ||
చరణము 2
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు – ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెప్పుడు – ఆ పట్టణమునకు దేవుని గొర్రెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లోక||
చరణము 3
మీరు లోకమునకు వెలుగైయున్నారు గనుక మీరు వెలుగు సంబంధులు – మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగైయుండక నరులందరికి వెలుగైయుందురనె యేసుండు ||లోక||
చరణము 4
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై – లోకమందు మరణ చాయగల దేశపు వాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగు ప్రభువు యేసుకు జయమని పాడరే ||లోక||