#110

యేసు జన్మము

రాగం: హరికాంభోజి · తాళం: త్రిపుట · రచయిత: ఫేలిక్స్ ఆండ్రూ

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్యమార్గము చూపన్ – పుట్టి నట్టి యయ్య పరమ గురుడు – ప్రాయశ్చిత్తుడు యేసుడు ||పుట్టె||
చరణము 1
ధరను పిశాచిని వేడిన దుర్జనుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుడు – వరభక్త జన పోషకుడు ||పుట్టె||
చరణము 2
యూదయ దేశములోను – బేత్లెహేమను గ్రామమున – నాదరింపనుద్భవించె – నధములైన మనల ||పుట్టె||
చరణము 3
తూర్పు జ్ఞానులు కొందరు – పూర్వ దిక్కు చుక్కను గాంచి – సర్వోన్నతుని మరి కొమరుని – కర్పణములిచ్చిరి ||పుట్టె||