#109
కరుణగల రక్షకుడు
పల్లవి · Pallavi
చింత లేదు ఇక యేసు పుట్టెను – వింతగను బేత్లెహేమందున – చెంత జేరను రండి సర్వ జనాంగమా – సంతోషమొందుదము ||చింత||
చరణము 1
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా – ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి – స్తుతులు నొనర్చిరి ||చింత||
చరణము 2
చుక్క గనుగొని జ్ఞాను లెంతో – మక్కువతో నా ప్రభుని గనుగొన – చక్కగా బేత్లెహేము పురమున జొచ్చిరి – కానుకలిచ్చిరి ||చింత||
చరణము 3
కన్య గర్భమునందు బుట్టెను – కరుణగల రక్షకుడు క్రీస్తుడు – ధన్యులగుటకు రండి వేగమె దీనులై – సర్వమాన్యులై ||చింత||
చరణము 4
పాపమెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను – దాపు జేరిన వారి కిడుగడు భాగ్యము – మోక్షభాగ్యము ||చింత||