Chapter 29 of 31 · వ్యాసాలు · Articles in Telugu
క్రైస్తవ జీవితము — ప్రార్థన
Original souvenir pp. 175–176
పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ప్రార్థన యొక్క అవశ్యకతను మనకు ఎంతో వివరంగా వివరించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించారు. విసుగక, ఎడతెగక, నిత్యము ప్రార్థించండి. మెలకువగా ఉండి ప్రార్థించండి. శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థించండి. ఒకరికొరకు ఒకరు ప్రార్థించండి. అ విధంగా చెప్పవలసివస్తే నూతన నిబంధనలో ప్రార్థనకు సంబంధించిన ఎన్నో అంశాలున్నాయి. ఏ వ్యక్తి ప్రార్థనలో అంటుగట్టబడ్డాడో ఆ వ్యక్తి బహుగా ఫలిస్తాడు. యోహాను 15.8లో
“మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు”.
ఏ కుటుంబములో కుటుంబ ప్రార్థన క్రమము తప్పకుండా ఆచరిస్తారో లేక జరుపుకొంటారో ఆ కుటుంబము దేవునికి బహుయిష్టమైన కుటుంబము. ఏ సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటాదో ఆ సంఘము దేవుని కొరకు బలమైన సంఘముగా వాడబడును. ప్రార్థన యొక్క ఉద్దేశము మనకు కావలసినది పొందడము కాదు కాని, దేవుడు కోరిన విధముగా మనము మారడమే. ప్రార్థనకు సమయమని స్థలమని నిర్దేశింపబడలేదు. క్రీస్తుద్వారా ఆయన సన్నిధికి ఏ సమయములోనైనా ప్రవేశించగలము. అది ఎంత అధిక్యతక్ష దేవునితో మన మనస్సు విప్పి మాట్లాడుకోవటమే ప్రార్థన. ప్రార్థన మనకు శ్వాసగా ఉండాలి. అంటే ఊపిరిగా ఉండాలి. దావీడు 30వ కీర్తనలో 8,9 వచనాలను మనము చూచినపుడు
“నేను గోతిలోనికి దిగినయెడలమన్ను నిన్న స్తుతించునా! నీ సత్యమును గూర్చి అది వివరించునా”
అని వ్రాయుట మనము చూస్తాము. అవును ఈ శ్వాస ఆగిపోయిన తరువాత మనము ఆయనను స్తుతించగలమా! దేవుడిచ్చిన యీ ఆయుష్షు కాలములో మనము ప్రార్థనను శ్వాసగా చేసుకోవాలి. దీనిని బట్టి మొదటిగా ప్రార్థనను మన ఊపిరిగా చేసుకోవాలి. అంటే ప్రార్థన మన breath. శ్వాసలేకపోతే మనము జీవించనట్లు ప్రార్థన లేకుండా క్రైస్తవుడు ఉండరాదు.
రెండవదిగా చూసినప్పుడు ప్రార్థన ఒక ఆయుధము. It is a weapon. ప్రతిదినము మనము న్యూస్ పేపర్లలో ఎన్నో ఘాతుకాలు చూస్తున్నాము. దొంగలు, దోపిడీదారులు ఎన్నో అకృత్యాలను పాల్పడుతున్నారు. ఇటువంటివారు మన మీద పడినప్పుడు మనచేతిలో ఒక ఆయుధము ఉండనుకొండి, సులభముగా వారిని ఎదుర్కోగలము ఉదాహరణకు మన చేతిలో ఇనుప రాడ్ ఉంటే వారిని ప్రతిఘటించగలము. అందుకు ప్రభువు మత్తయి 26:41లో
“మీరు శోధనలో ప్రవేశించకుంటునట్లు ప్రార్థన చేయుడి”
అని చెప్పాడు. ఎఫెసీ 6:10-18 వరకు చెప్పబడిన సర్వాంగ కవచాన్ని ధరించినపుడు అపవాదియనే శత్రువును మనము ఎదుర్కొనగలము. శరీరరీతిగ బలహీనుడై విశ్వాసి మోకాళ్ళపై ప్రార్థించగనే శత్రువు దానంతట అదే మటుమాయమవుతాది. శోధనలనే కెరటాలతాకిడిని అడ్డుకోవాలంటే ప్రార్థన అనే ఆయుధము క్రైస్తవ జీవితములో ఉండవలసిందే.
ప్రార్థన ఒక ఆజ్ఞ. ఇది మూడవది. It is a commandment మన అధికారులు మనకు ఆజ్ఞలను యిస్తే పాటిస్తాము కదా! డ్రైవింగ్ నేర్చుకొన్న ప్రతి ఒక్కరికి రూల్స్ కొన్ని ఎర్పాటు చేస్తారు. దానిని అతిక్రమిస్తే ప్రమాదము తప్పదు. ఫిలిప్పీ 4:6
“దేనిని గూర్చియు చింతపడకుడి, కాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనమలచేత కృతజ్ఞతాపూర్వకముగ మీ విన్నపములు దేవునికి తెలియజేయండి”.
మత్తయి 5:44 “నేను మీతో చెప్పనదేమనగా
“మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి.
ప్రభువు తానే ఆ పనిచేసి మనకు మాదిరి అయ్యాడు. తనను హింసించి మరణానికి అప్పగించిన వారికొరకు ప్రార్థించాడు.
“తండ్రీ వీరెమి చేయుచున్నారో వీరెరుగరు. వీరిని క్షమించమని ప్రార్థించాడు”.
లూకా 23:34 దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. పరిసయ్యుడు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. లూకా 18:11 పరిసయ్యుడు నిలువబడి గుండెలు బాదుకొని ఎంతో బిగ్గరగా తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థన చేసాడు. సుంకరి చిన్న ప్రార్థన ప్రభువు ఎందుకు అంగీకరించాడంటే ఆయన ఆజ్ఞలను సుంకరి మీరలేదు. దావీదు అనేక పర్యాయములు తన కీర్తనలతో
“నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను. కనుకనే దేవుడు నా ప్రార్థనను ఆలకించెనంటాడు”.
ఇతరులలోపాలను ఎంచి వారిని నొప్పించే విధముగా మన ప్రార్థన ఉండకూడదు. కనుకనే మన దేవుడు
“నీ హృదయములో పాపాన్ని లక్ష్యము చేస్తే నీ మనవి వినను”
అంటాడు.
నాల్గవదిగా ప్రార్థన ఒక అభ్యాసము. Is is a practice. ఆచరించాలి, చేసి చూపాలి. మన ప్రభువే మనకు దీనిలో మార్గదర్శకుడు. ప్రజలను చూచి కనికరపడి జాలిపడి, వారి దుస్థితిని చలించి కదిలిపోయెను. అట్టివారిని అక్కున చేర్చుకొని ప్రార్థించేవాడు. పేదవారి దుస్థితి కొరకు ప్రార్థించి ఇతరులఅక్కరలకొరకు ప్రార్థించి వారికి మనము చేయు విదల్చకపోతే మన ప్రార్థనను ఆచరణలో పెట్టనట్లే. కొన్ని సార్లు ప్రార్థన మొదలు పెట్టగానే ఇతరులఅక్కరలు కనుమరుగై మన స్వార్థమే జయిస్తుంది. ఒక భక్తుడు యిలా అన్నాడు. We can preach a better sermon with our lives than with our lips, కొరింథీ 3:9
“మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా”
మన
బిడ్డలకు ప్రార్థన ఉగ్గుపాలతో అభ్యసింపజేయాలి. సామెతలు 22:6లో "బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పుము. వాడు పెద్ద వాడైనపుడు దానినుండి తొలగిపోడు". మత్తయి 23:3 లో శిష్యులతో శాస్త్రులు పరిసయ్యులను గురించి ప్రభువు ఈ విధముగా చెప్పుట మనము చూస్తాము. "అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురేగాని చేయరు".
ఐదవదిగా ప్రార్థనను ఒక అలవాటుగా చేసుకోవాలి. It is a habit. మేము ఒకసారి మా బంధువులింట్లో జరిగే వివాహానికి చెన్నై వెళ్ళాము. వెళ్ళిన బంధువులకు విడిది యిచ్చారు. పెండ్లి ఇల్లు చాలాదూరంలో ఉంది. కాఫీ, ఫలహారాలు మాకు అందడానికి చాలా సమయం పడుతుంది. మాలో కొందరికి ఉదయాన్నే టీ, కాఫీలు అలవాటు. కాఫీ, టీలు పడకపోతే యీ మానవ శరీరము ముందరికి నడవవు. లేవగానే యీ అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. క్రైస్తవులముగా మనకుండవలసిన ముఖ్య అలవాటు ఏమై ఉండాలి. ప్రభువు సన్నిధిలో మోకరించి సమయము గడిపే అలవాటు. ప్రభువు తన సేవాకార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలుపెట్టాడు. (లూకా 3: 21, 22) లూకా 6:12లో మనము చూచినట్టైతే శిష్యులను ఏర్పరచుకొనకముందు ప్రార్థనలో గడిపాడు. మార్కు 1:35లో "ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి యుండగనే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన యింటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి యుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచువచ్చెను. (దానియేలు 6:10) విలాప వాక్యములు 2:19లో యింకొక ఆజ్ఞ వ్రాయబడెను. "నీవు లేచి రేయి మొదటి జామున మొఱపెట్టుము" కీర్తనాకారునివలె మేల్కొనపుడు ఆయన స్వరూప దర్శనములో మన ఆశను తీర్చుకోవాలి. ఇది మనకు ముఖ్యమైన అలవాటుగ మారాలి.
చివరిగా ప్రార్థనలో గడపాలి అనే ఆశ కల్గియుండాలి. క్రైస్తవులముఖ్య డిజైర్‌గా ప్రార్థన మొదటిస్థానంలో ఉండాలి. వాక్యము చదవడమంటే దేవుడు మనతో మాట్లాడడము. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడాలి. ప్రార్థనపోరుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచి గొప్ప దైవజనుడైన బిల్లీగ్రాహమ్‌గారు తన 90+ సం॥లన్నిటిలో అమెరికా సంయుక్త రాష్ట్రములో ప్రెసిడెంట్లు ఐన ప్రతి ఒక్కరిని కలవగల్గారు ఈ విషమయి విలేకరులు ఆయనను ఇంటర్వ్యూలో అడిగినపుడు అదెంత గొప్ప విషయమన్నట్లు చెప్పి ఒకే మాటన్నారు. ఆయన "That is nothing Today I talked with God" బైబిలులో గొప్ప భక్తులైన యెషయా, యెహెజ్కేలు, యోహానులు దేవుని దర్శనాన్ని చూచినవారు. దావీదు 63:5 కీర్తనలో "రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునపుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది. అంటాడు. ప్రార్థన అనే ఆశ కల్గిన లూథియ అనే స్త్రీని మనము అ.కా 16:13లో చూస్తాము. ఆశ కల్గిన మన ప్రాణాలను దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేయుట మన విధి. It is our duty. ప్రతీ ఒక్కరము సేవలో పాల్గొనలేము. కానీ వారికొరకు ప్రార్థించాలి.
There is Holy High Vocation Needing Workers every where It is the Highest form of Service It is the Ministry of Prayer
అవును ప్రార్థించుట సేవలన్నింటిలో ఉత్కృష్టమైనది. శ్రేష్టమైనది.
This article was set in a legacy (non-Unicode) Telugu font in the printed souvenir. It has been re-typed into Unicode Telugu for this web edition so that it can be searched, resized and read by screen readers. The original printed pages are reproduced below.
View the original printed pages

