డ్వైట్ ఎల్. మూడీ పేరు సమస్త కాలములలోని “సామాన్య” ప్రసంగికుల జాబితాలో అగ్రస్థానమున నిలుచును. అతని కుమారుడు విలియం ఆర్. మూడీ అతనిని గూర్చి ఇట్లు చెప్పును, “తండ్రి కేవలము దేవుని మహిమకొరకును యేసుక్రీస్తు సువార్త వ్యాప్తికొరకునే జీవించెను.” దీనికంటె గొప్ప నివాళి ఏ మనుష్యునికిని చెల్లింపబడజాలదు. అతని పరిచర్య అంతయు ఆత్మల రక్షణకే అంకితమైయుండెను. ఆత్మలను గెలుచుట అత్యున్నత క్రైస్తవ వీరత్వమును కోరును. ఈ జీవిత చరిత్ర పఠనము యౌవనునికైనను వృద్ధునికైనను ఆత్మలను గెలుచువాడగుటకు లోతైన కోరికను రేపును గాక. ముఖ్యముగా మన యౌవన సంపదనుండి యజమానుని పిలుపుకు హృదయపూర్వక ప్రత్యుత్తరము వచ్చును గాక: “నేడు నా ద్రాక్షతోటలో పనిచేయుము.” ప్రచురణకర్తలు
డి. ఎల్. మూడీ — ఆత్మలను గెలుచువాడు · ప్రచురణకర్తలు
