యోబు గ్రంథము

అధ్యాయం 7 · Job Chapter 7 · 21 వచనములు

అధ్యాయము 7

గ్రంథము: యోబు గ్రంథము· నిబంధన: పాత నిబంధన· వచనములు: 21

1భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా?

2నీడను మిగుల నపేక్షించు దాసునివలెనుకూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను

3ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి.నేను పండుకొనునప్పుడెల్ల

4ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును.తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడు దును.

5నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది.నా చర్మము మాని మరల పగులుచున్నది.

6నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవినిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.

7నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.

8నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు.నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.

9మేఘము విడిపోయి అదృశ్యమగునట్లుపాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు

10అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

11కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

12నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు?

13నా మంచము నాకు ఆదరణ ఇచ్చును.నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా

14నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవుదర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

15కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.

16అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

17మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?

18ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

19ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

20నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?

21నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.