ఈ తెలుగు ఎడిషన్ యంత్ర సహాయంతో అనువదించబడింది; సమీక్ష కొనసాగుతోంది. అధ్యయనానికి ఆంగ్ల మూల గ్రంథమే ప్రామాణికం. తప్పులు కనిపిస్తే [email protected]కు రాయండి.

31లో 28వ అధ్యాయం · వ్యాసాలు · తెలుగులో వ్యాసాలు

పక్షిరాజు వలె ఎగురుట, పరుగెత్తుట, నడచుట

అసలు స్మారక సంచిక పేజీలు 173–174

యెషయా 40:31 "యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లకి నడిచి పోవుదురు."

ఒక పల్లెటూరిలో రైతు కోడి పిల్లలను, బాతు పిల్లలను కలిపి పెంచేవాడు. పొలంలో ఒక గ్రుడ్డు దొరికింది. అది పక్షిరాజు గ్రుడ్డు. అన్నిటితోపాటు దాన్నికూడా పొదగనిచ్చాడు. పక్షిరాజుపిల్ల కోడి పిల్లలతోపాటు గింజలు ఏరుకొని తినసాగింది. దాని ఆకారం వేరుగా ఉంది. అలవాట్లు మామూలుగా ఉన్నాయి. ఒక రోజు ప్రముఖ శాస్త్రవేత్త పక్షుల ఉనికి, వాటి ఆలవాట్లను పరిశోధించే కాలంలో పక్షిరాజు పిల్లను చూచాడు. రైతుతో వాదించాడు. "దీని స్థానం యిక్కడ కాదు రెక్కలు చాచి ఎగరాలి. దృష్టితో వాటిని మనస్కరించాలి" అని, ఆ పక్షిరాజును ఎత్తైన స్థలాలకు కొనిపోయాడు. ఎగరడం నేర్పాడు. కొంతకాలము నిరుత్సాహం కల్గినాసరే పట్టు విడువక రెక్కలు వాడుకొనే పద్ధతిని ఎత్తైన స్థలంలో నేర్పాడు. సహజ శక్తి గలపక్షిరాజు తన రెక్కలలోని శక్తిని నమ్మింది.

ఇక ఆ పక్షి నెమ్మదిగా పైకి ఎగరటం నేర్చుకుంటుంది. ఉన్నత ప్రదేశాల్లో సూక్ష్మదృష్టితో ఎత్తైన ప్రదేశాలలో గూడు నిర్మించుకొనే పక్షిరాజు దేవుని గొప్ప స్వాస్థ్యముతో పోల్చబడింది. దేవుడు వాక్యాన్ని నోటితో పోషిస్తున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమేకాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతిమాట వలన జీవిస్తాడు. పక్షి తన పసికందుల్ని నోటితో పోషిస్తుంది. దేవుని ప్రవక్తలు పక్షిరాజులే, వారు ఆయా తరాలలో దేవుని మాటలప్రసంగాలద్వారా ఆత్మీయ చైతన్యాన్ని కల్గించేవారు. పక్షిరెక్కలు రెండు పాత, క్రొత్త నిబంధనలుగా భావించగలము. మరొక అర్థంలో ప్రార్థన మరియు వాక్యము రెక్కలు అయితే పరిశుద్ధాత్మ అనేగాలిలో ఎగురుతాము. గగనంలో పైకి ఎగిరే పక్షిరాజు జీవితం ప్రతి విశ్వాసికి కావాలి. పక్షిరాజు చిన్న పక్షులకు ఎగరడం నేర్పడం వింతగా ఉంటుంది.

ద్వితీయో 32:11

పక్షిరాజు రెక్కలు చాపి ఉంచగా గాలి వీచినప్పుడు వాటిని లేపును. సంఘం కూడా విశ్వాసపు రెక్కలపై వాగ్దానములందు నమ్మిక ఉంచాలి. అప్పుడు పరిశుద్ధాత్మ పైకి తీసికొని వెళ్తుంది. అవినీతి, భక్తిహీనత, స్వార్ధము నిండిన ఈ లోకంలో విడుదల దయచేసి పాపమునకు అతీతముగా పైన నివసించుటకు, ఆశీర్వదింపబడిన వాతావరణమందు జీవించునట్లు పైకి కొని పోవును. భూలోక సంబంధులు కోడివలె ఎగరలేని స్థితికి అతీతముగా పక్షిరాజులా ఎగిరే స్థితికి రావాలి.

19:4

దేవుడు రెక్కలు మీద మోయుట మాత్రమే కాదు ఆదరిస్తున్నాడని వివరిస్తున్నారు, చాలా సార్లు కోడిలాగా చూస్తూ మకిలిలో గింజలు కెలుకుతూ ఉంటాము. యిహలోక బాధలతో సతమతమవుతాము. పక్షి రెక్కలలో విశ్వాసముంది, తప్పించుకొనే యుక్తి ఉంది. దావీదు కీర్తన 55:6 లో చూచినట్లు శ్రమలో తప్పించుకొనే గువ్వగా ఉండటం దేవునికి యిష్టం లేదు. గువ్వ రెక్కలు గలవారు శ్రమలు తప్పించుకొనేవారుగా ఉంటారు. పక్షిరాజు రెక్కలు గలవారు విజేతలు.

విస్తారమైన శ్రమలద్వారా దేవుడు విశ్వాసిని పరీక్షించే సమయంలో దేవుని చేతిలో తీవ్రతను సరిచూచే పరికరాలుంటాయి. గ్రహించకల్గిన పరిస్థితిని తగిన రీతిగా నేర్పిస్తారు. అసలైన పక్షిరాజు విశాలమైన రెక్కలతో తాపీగా ఎగరడం అలవాటు. యిహలోక బంధాలకు అతీతంగా దూరంగా నివసించడం విశ్వాసి కర్తవ్యము. కొన్నిసార్లు విశ్వాసిగా ఉంటూ ఆత్మీయతలో ఎగరడం నీవు, నేను, కోడివలె రెక్కలయితే ఉన్నావుగాని ఎగుర లేని స్థితిలో గింజలకై క్రింద వెదకులాడుచు ఐహికావసరములకై జీవితమంతా శ్రమించి, తలాంతులను ఖర్చు చేస్తున్నామేమో ఆలోచించాలి.

క్రైస్తవ విశ్వాసి కూడా ఉన్నత ఆశయాలు కలవాడై, పైనున్న పరలోక ధ్యానంతో విలువైన రక్తముకార్చి రక్షించిన క్రీస్తుతోనడిచి భూలోకంలో వెంబడించాలి. ఉన్నత పిలుపుకై విశ్వాస వీరులుగా పందెంలో ఓపిగ్గా పరిగెత్తాలి. హనోకు దేవునిలో నడిచిన విశ్వాసపు నడక నడవాలి. ఆడపక్షి గ్రుడ్డు పెట్టి, పొదిగే సమయంలో మగపక్షి మాంసము, మంచి ఆహారము తెచ్చి భార్యను పోషించుట, పొదగడానికి ఎన్నుకొని గూడు

నిర్మాణములో స్థలములో ఆరుగూడు ఎత్తైనది. విభిన్న చెట్టు కొమ్మలు, రెమ్మలు, పీచు పదార్థాలు సేకరించి శ్రమతో ఆ వెలుపలి బలమైన ముళ్ళుగలకొమ్మలలోను, లోపలమెత్తని పదార్థాన్ని అమర్చి, మరింత సుతిమెత్తని పాన్పులా తయారు చేసే ఆకాంక్షలలో ఈ కలలను తన గోటితో పీకి పసికూనలక్షేమార్థం అన్ని సవ్యంగా అమర్చుతుంది.

గ్రుడ్లు పొదగగానే పసిపిల్లలు తల్లి వెచ్చని కౌగిలిలో జీవితమెంత హాయిగా ఉందో అని ఎగిరేసరికి కాళ్ళలో సత్తువ వచ్చి మెత్తని ఈకలు చెదరి ముళ్ళ భాగంలో యిరుక్కొని గ్రుచ్చిన ముళ్ళ బాధలో మూల్గుతూ ఎన్ని కష్టాలొచ్చాయో అని అటూ ఇటూ ఒరిగి చూస్తూ నొచ్చుకుంటుంది. పిల్లలకాళ్ళకు సత్తువ వచ్చిందని తల్లి గ్రహించి ఆ పిల్లలకు ఎగిరే వయస్సు వచ్చిందని ఎగురుట నేర్పాలంటే ఆ గూడు చెదర గొట్టే పక్షి పిల్లలను క్రిందకు పడే సమయంలో రెక్కలు చాచి అవి వేగంతో ఆ రెక్కలభారంపై పక్షిపిల్లలు పడేలాగా ఆ రెక్కలకదలికలను బట్టి ఎగరుతుంది. ఇక క్రమేపీ రెక్కలలో సత్తువతో తల్లిని అనుకరిస్తూ గగనం పై సంచరించడం ఆరంభించి సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతుంది. మనము కూడా దేవుని వైపు చూస్తూ పైకి ఎగిరి సొమ్మసిల్లక నడిచి మోక్షానికై ఎదురుచూచే విశ్వాసిగా నిలవాలి మారుమనసు పొందిన రోజుల్లో అంతా ఆనందమే ఆ తర్వాత శ్రమలనే పాఠాలద్వారా ఆత్మీయ బలాన్ని పొందుతాము.

పక్షిరాజు జీవన గమనము విశ్వాసి విశ్వాసయాత్రకు నిదర్శనము, చిన్నపక్షి పిల్లలు ఆ తల్లి రెక్కలపై తమ కాళ్ళను ఎలా ఉంచాలో ఎరిగి ఉంటాయి. ముక్కుతో గట్టిగా తల్లి ఈకలుపట్టుకొని ఉంటాయి. అంతా సిద్ధం అయినట్లు గొప్ప ఈలవేస్తుందట తల్లి, పిల్లలకు అభయం అదే. ఇక మధ్యాకాశములో రెక్కలు చాచి ఎగురగలదు. పక్షిరాజు తాజా ఆహారము తీసుకున్నట్లు, విశ్వాసి అనుదిన ఆహారము తాజాగా తీసుకోవాలి. పిల్లలు ఎన్నడూ తమ స్వంత బలముపై ఆధారపడక తల్లిపై ఆధారపడతారు. హాని కలుగకుండా దేవుని వాక్యాన్ని ఎలా పట్టుకొనాలో గొప్ప కదలిక ఏర్పడినప్పుడు ప్రతి పరిశుద్ధ వాగ్దానము గట్టిగా పట్టుకోవాలి.

తల్లి పక్షి నిజమైన ప్రేమతో గొప్పగా కనిపెట్టి బిడ్డలను కాచును. పిల్లలు తల్లిపై ఆధారపడతాయి. విశ్వాసి దేవుని స్వరాన్ని వినును, గొర్రె తన కాపరి స్వరాన్ని వింటుంది. పక్షిరాజు ముక్కు ఆహారాన్ని సేకరించడానికి సహకరిస్తుంది. దూరదృష్టితో ఆహారాన్ని గుర్తించి పొందుకొని అనంతదూరాలకు పైకి ఎగసిపోతుంది. యౌవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనె క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. పక్షిరాజు వృద్ధాప్యం వచ్చినప్పుడు బండ సందులోకి వెళ్ళి దాగుకొని ఈకలన్నీ తన ముక్కుతో పెలికి ముక్కు కూడా బండపై బాదుకొని రక్తము కారుతున్నప్పటికి సహిస్తూ తిరిగి ఈకలు ముక్కు వచ్చు వరకు అదేచోట నిలిచి ఉంటుంది. అదే యవ్వనం తిరిగివచ్చి బలముతో శక్తితో నిలిచి ఉంటుంది.

విశ్వాసి ప్రాచీన స్వభావము వదలి నూతన శక్తికై కనిపెట్టి ప్రార్థించి దేవునిలో ఎదగాలి. వెనక ఉన్నవి వదిలి ముందువైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపిగ్గా పరుగెత్తాలి. వడిగలగుఱ్ఱలవలె పని కలిగి దేవుని సేవకై పరుగెత్తాలి. హోనోకువలె నడిచి సాగాలి. విశ్వాసపు నడక విధేయ నడక, ప్రేమనడక కావాలి. దేవుని అధిపత్యంలో నిత్య రాజ్యానికి నిత్య జీవానికి, గువ్వలా జీవించడం కాదు గాని పక్షిరాజులుగా జీవించడం నేర్చుకోవాలి.

చివరిగా హృదయంలో నిండిన నిరీక్షణతో ప్రతి విశ్వాసి పాట పాడగల్గాలి

“వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవా, నన్ను కాపాడవాడవు నీవే, ప్రభువా నిన్ను నేకొనియాడెదన్. అన్నివేళలయందు నిన్ను పూజించి కీర్తింతును.”

మనమంతా పక్షిరాజు వలె రెక్కలుచాపి ఎగరాలి. అలయక పరుగెత్తాలి. సొమ్మసిలక నడిచిపోవాలి. ఆ నడక చివరకు మనలందర్ని నిత్యత్వములో స్తుతించి ఆరాధించుటకు పరలోకానికి చేర్చాలని ప్రార్థిద్దాం.

ఆమెన్, హల్లెలూయ..

ముద్రిత స్మారక సంచికలో ఈ వ్యాసం పాత (నాన్-యూనికోడ్) తెలుగు ఫాంట్‌లో ఉండేది. స్క్రీన్ రీడర్‌ల ద్వారా శోధించడానికి, పరిమాణాన్ని మార్చడానికి మరియు చదవడానికి వీలుగా, ఈ వెబ్ ఎడిషన్ కోసం దీనిని యూనికోడ్ తెలుగులోకి తిరిగి టైప్ చేయడం జరిగింది. అసలైన ముద్రిత పేజీలు కింద పునరుత్పత్తి చేయబడ్డాయి.

View the original printed pages
Home Contents Back to top