UECF.NET

UECF Program

వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో

← All programs

వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో

కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో

క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా

కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా

బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి

రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే

శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే

జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే

మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే

మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో

క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)