UECF.NET

UECF Program 6:00 AM

బ్రదర్ సుధాకర్ చిలక గారి ఆధ్వర్యంలో సంగీత గాన బృందం దేవుణ్ణి ఆరాధించించారు.

← All programs

ప్రవాసాంధ్రులు, క్రైస్తవులు న్యూజెర్సీలోని యునైటెడ్ ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్ church లో ఈస్టర్ పండుగ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. యేసు ప్రభువు సిలువ యాగము చేసి, సిలువపై మరణించి తిరిగి మూడవ దినమున పునరుథానుడై లేచెను, అందుకు సాదృశ్యంగా జరుపుకునే ఈస్టర్ పండుగ వేడుకులలో పాల్గొనడానికి న్యూ జెర్సీలో ని పలు ప్రాంతాలనుండి క్రైస్తవులు వందలాదిగా ఉదయమునే 6:00am UECFచర్చికు తరలి వచ్చారు.

చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతోను, గాన బృందము భక్తి గీతాలతోను, సంఘ కాపరి Rev. Dr. David Ravinder గారు క్రిస్మస్ సందేశంతో క్రీస్తుని ఆరాధించారు.

UECF Church న్యూజెర్సీ రాష్ట్రంలో 1997 సంవత్సరంలో స్థాపించబడింది. గత 24 సంవత్సరాలనుండి భారత దేశంలోని పేద సంఘాలను, అనాధ ఆశ్రమాలను , విధవరాండ్రలను, వికలాంగులను, గ్రుడ్డి వారిని ఆర్ధికంగా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న విషయాన్ని UECF Church President జాషువా ఫణి పిల్లి గారు వెల్లడించారు.

కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు తమ ప్రియులను కోల్పోయినందున వారి కొరకు, అలాగే చికిత్స పొందుచున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలను చేశారు.

ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను అందరికి పంచాలి, యేసు క్రీస్తు మనందరితో వున్నాడు మీరు భయపడకుడి అనే క్రిస్మస్ సందేశం అందరిని బలపరిచింది.

బ్రదర్ సుధాకర్ చిలక గారి ఆధ్వర్యంలో సంగీత గాన బృందం దేవుణ్ణి ఆరాధించించారు.

టీవీ వ్యూయర్స్ అందరికి చర్చ్ నాయకత్వం, చర్చ్ పాస్టర్, ఇతర సంఘ సభ్యులు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను తెలిపారు.