ఉన్నతమైన స్థలములలో (Cm)
ఉన్నతుడా మా దేవా
మాకు తెలుపుము దేవా (ఉన్నత)
మందగించినది ఆత్మలభారం
నీ స్వరముతో మము మేలుకొలుపు
నూతన దర్శన మీయుము దేవా
మము నిలుపుము దేవా (ఉన్నత)
తెలిసికొనుము మా తలంపులను
వున్నదేమో పరికించు చూడు
సేదదీర్చి బ్రతికించు మమ్ము
స్థిరపరచి బలపరచుము దేవా(ఉన్నత)
పానార్పణముగా ప్రోక్షించెదము
రూపాంతర నూతన మనసులతో
నీ కృపచేత బలపడియెదము
భారము తోడ ప్రకటించెదము(ఉన్నత)