ఒకసారి ఆలోచించవా (Dm)
పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ || 2 times ||
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో || 2 times ||
… ఒకసారి…
1. తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో || 2 times ||
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .
. ..నీ జీవిత ...
2. దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి || 2 times ||
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
...నీ జీవిత ..
3. లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
...నీ జీవిత ..