UECF.NET

UECF Program

GodVsSatan

← All programs
Song / Hymn

Hymn Lyrics

Skit opens with an entry of Satan and his followers with costumes and background music .. 

After 2-3 mins Satan looks at heaven and the audience and opens his dialogues .. 

Satan Dialogue 1: Vasudaikaa kutumbam……. hahaha…..దేవుని రాజ్యము ఇదేనా ? దేవుని ప్రజలు వీరేనా ? ( హ హ హ నవ్వుతూ ) .. ( పాపం వాసన పసిగెట్టుతున్నట్లు  ) పాపం , పాపం .. ఆహా బహు ప్రియం .. కల్మషం కల్మషం ..  వీరు తినే తిండి కల్మషం .. పీల్చే గాలి కల్మషం , పలికే పలుకు కల్మషం .. వీరి మనసే  KALMASHAM..… Veeri HRUDAYAM …నా పాపాలకు పుట్టిల్లు .. వీరి మధ్య దాయాదుల పోరాటాలు , అసూయలు , రాగ ద్వేషాలు , దురాశలు , కోప  THAAPAAALU….. వాళ్లకు నేనిచ్చే అనుదిన బహుమతులు.. హ హ హ నేనే వీరి క్రొత్త దేవుణ్ణి .. అవును నేనే వీరి క్రొత్త దేవుణ్ణి - ఈ ప్రపంచం .. ఈ జనాలు అందరు నా గుప్పెట్లో ఉన్నారు .. నా chethiloooo Veeranthaa….. కీలు బొమ్మలు .. veeranthaa naa vasham… Veeri pai naa swaari….. Ha ..ha ha…హ హ హ నేనే వీరి క్రొత్త దేవుణ్ణి .. నేనే క్రొత్త దేవుణ్ణి ….  NENEYYYY….HAHAHAHA….

సాంగ్ బిట్ 

Jesus Dialogue  1: నా తండ్రి రాజ్యము కృపతో కట్టబడింది.. ఆ రాజ్యానికి ప్రేమానురాగాలే పునాదులు. వారి మధ్య ఉన్న ప్రేమే వాళ్లకు మనుగడ .. నీవు చెప్పినవన్నీ అశాశ్వతం. కానీ నా ప్రేమ శాశ్వతం. నా కరుణ నా వారి మీద నిత్యము కాచే వెన్నెల లాంటిది. నా వాళ్ళు తినే తిండి , పీల్చే గాలి ఈ సృష్టిలోని సమస్తము నా ప్రేమతో నిండి ఉంది. నా వారి కష్ట నష్టాలు పరీక్షలే .. కానీ అందులో కూడా నా శాంతి, సమాధానములు వారికి తోడుగా ఎల్లప్పుడూ ఉంటాయి. నా యందు నిరీక్షణ కలిగి , నా రక్షణ పాత్రను చేపూని నా యందు సుఖ సంతోషాలతో జీవిస్తారు. నా తండ్రి రాజ్యములో ప్రతి ఒకారికి చోటుంది. నా యందు విశ్వాసము కలిగి నన్ను స్వీకరించిన వారు అందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు.

Satan Dialogue 2: NITHYAA JEEVAMAA… EVARIKI DEVAA….. ఓ దేవా .. .. అసలు ఏంటి నీ గొప్ప ? ఈ జనాలు ఉన్నారే వాళ్లలో 80 శాతం నేను చెప్పిన కేటగిరియే ..  నన్ను నిరూపించమంటావా ? దేశాల మధ్య యుద్ధాలు..  ఎవరికైనా మనశ్శాంతి ఉందా? ఎవరైనా రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నారా?  పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరిని తొక్కుతామా? ఎవరి తల మీద కాలు పెట్టి పైకి వెళ్దామా?  నిన్నటికి ఈరోజుకి ఎంత డబ్బు కూడా వేసామా అనే కదా ఆలోచనలు. Ekkada .. bangalaa untey kondhaama.. Yey.. brand CAR kondhaama…. Peddala meeda gouravam ledu.. Pillalu thalli thandrulanu gouravincharu… Vaariki  DEVUNI MEEDA…. bhayamuuuu asaleyyyy leduu…. భార్యకి భర్త మీద కోపం అనుమానం భర్త కైతే భార్య మీద అసలు ప్రేమే లేదు.  నీవు చెప్పిన ప్రేమనేదే ఉంటే ఆ ప్రేమ కనీసం భార్యాభర్తల మధ్య లేకపోతే ఇక పక్కనోడి మీద ఎవరికైనా ఎక్కడినుంచి వస్తుంది ప్రేమ.  నువ్వేమో టెన్ కమాండ్మెంట్స్ annavu.. Bhakthi, gouravamu… annavuu…. అసలు నువ్వు తప్పితే ఎవరైనా ఈ ప్రపంచంలో పాటిస్తున్నారా?

Jesus Dialogue 2: వీరందరూ నా బిడ్డలు. వాళ్ళ కోసం నేను నా రక్తం చిందించాను. నీవు చెప్పిన ఈ పాపాలు కేవలం నీ శోధనలు మాత్రమే. కానీ, ప్రతి కష్టంలోనూ నా బిడ్డలు నావైపు చూస్తారు. నా రెక్కల చాటున నావాళ్లు క్షేమమే. వాళ్ళు  మంచి వుద్దేశ్యంతో ప్రార్ధన చేస్తే  కోరినవాణ్ణి నేను ఇస్తాను. ఎప్పటికైనా వీరందరూ నేను చూపిన మార్గంలో నడిచి నా రాజ్యానికి చేరుకుంటారు. నా సన్నిధిలో నా చెంతనే సుఖ సంతోషాలతో హాయిగా వుంటారు. 

Satan Dialogue 3: Sukhamuuuu Santhoshamu… Ekkada Saaamyy…?  .. రోజుకు ఎంత మంది దిక్కు లేని చావుతో చస్తున్నారు. దేశాల మధ్య యుద్ధాలతో, మొన్న కరోనా అనే మహమ్మారిని పంపానుగా ఎంత మంది .. Anthaa… naa raajyamulokeyyyy….. ఇక ఐసీసిడెంట్స్ అని అవనీ ఇవనీ చెప్పుకుంటూ పోతే లిస్ట్ పోతూనే  CHALAAA PEDHAA LIST SAAMYYYY….. స్టాటిస్టిక్స్ కావాలంటే మా టీం చూపిస్తారు. 

Jesus Dialogue 3: (చిరు నవ్వుతో) ఎంతో మంది అనుదినము రక్షింపబడుచున్నారు కూడా. ఆయా దేశాలలో రగిలిన ఉజ్జీవాలతో ఎంతో మంది నన్ను సొంత రక్షకునిగా ఎంచుకొని నా తండ్రి రాజ్యానికి వారసులవుతున్నారు. నా ప్రేమను ప్రపంచమంతా చాటుచున్నారు. ఎంతోమంది నన్ను నిస్వార్ధంగా సేవిస్తూ, హత:సాక్షులుగా మారుతున్నారు. వారి త్యాగపూరితమైన సేవను చూచి ఎంతో సంతోషించాను. సర్వము త్యజించి నా సిలువను మోస్తూ భూదిగంతములకు నా సువార్తను మోసిన ఆ సుందర పాదములు నా ప్రియము కాదా? నా ప్రేమ, కరుణ, కృపాలాలో వర్ధిల్లుతూ అనుదినము, అనుక్షణము ఎన్నో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. 

Satan Dialogue 4:సరే సరే కానీ , IEvanniii OK….. ఒక పందెం ( CHALLENGE )  వేసుకుందాం. ఆ  పందెంలో నేను గెలిస్తే నీ రాజ్య వారసులు అదే రక్షించ బడిన వారందరు, నీ రక్తంతో కడగబడిన వారందరినీ నాకిచ్చే. నువ్వు గెలిస్తే ఈ జనాలను ఈ ప్రపంచాన్ని హా హ హ ( నవ్వుతు ) వీరి కొత్త దేవుణ్ణి కదా .. ఇక వేదించకుండా నా పాపాలన్నిటిని వాళ్ళ నుదిటి మీద నేనే నీ దగ్గరకు నేనే స్వయంగా పంపిస్తాను. 

Jesus Dialogue 4:(కోపంగా) నీవు పాపాలను తుడిచివేయుదవా? నీ శోధనలో అంట శక్తి  లేదు. గతములో నీవు నన్నే శోధించలేదా? దాని ఫలితము మరచితివా? రాళ్లను రొట్టెగా మార్చుమని శోధించావు. "మనిషి రొట్టె వలన మాత్రమే కాక, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవించును' అని నేను పలికితే యెరూషలేము ఆలయముపైనుండి దూకమని శోధించావు. 'నీ దేవుడైన ప్రభువును పరీక్షింప కూడదు' అని నేను పలుకలేదా? ప్రపంచ రాజ్యాల మహిమ చూపించి, ఇవియన్నీ నీకిస్తాను ఒకసారి నన్ను ఆరాదించమని నన్ను నీవు శోధించలేదా? ' నీ దేవుడైన ప్రభువును ఆరాధించుము, ఆయనకే నసేవచేయుము' అని పలికి నా తండ్రి నా కిచ్చిన దైవ కార్యాన్ని నేను సఫలము చేసి రక్షణ భాగ్యాన్ని సర్వ మానవాళి కోసం కల్పించలేదా? అయినాను నీ శోధనలనుబట్టి నేను కలవరమొందెదనా? దేనికైనా సిద్దమే. అలాగే కానిమ్ము. 

Satan Dialogue 5:ఈ పందెం ( CHALLENGE ) .. ప్రేమకు .. DVESHANIKI…HA HAHA….. PUNYANIIKI …..పాపానికి మధ్య ..హా హా ఈ క్రొత్త దేవునికి ఈ దైవ కుమారునికి మధ్య. నాకెంతో ప్రియమైన ఏడు పాపాలను ఏడుగురి స్నేహితుల మధ్య ప్రభావితం చేస్తా .. వారందరిని పీడిస్తూ, శోధిస్తూ నా వశములో UNCHUKUNTAANU….. వారిలో ఒకడు , నిన్ను నమ్మే… RAKSHINCHABADINAAA… NEE KUMAARUDUUU…. అమాయకుడు, Veedu …కూడా వాళ్ళ స్నేహితుడే.  VEEEDU CHESINA ATHI PEDDAA PAPAM EEEE AARUGURITHOOO SNEHAM CHEYADAMEY….. VEEDI DHVAARA NUVVU AAA AARUGURINI MAARCHU KUNTAAVOOOO … EEE AARUGURU.. VEEDINI MAARCHU KUNTAARO…. CHALLENGE……..నువ్వు ఆరు వారాలలో వీరందిరిని ఆ ఒకడి ద్వారా మార్చ గలిగితే నువ్వు గెలిచినట్టే ( హ హ హ ) గట్టిగా నవ్వుతు. 

Last Scene of Satan Vs God

Satan Dialogue 1 :  ప్రభు.. ప్రభు 

Jesus Dialogue 1 : వచ్చావా 

Satan Dialogue 2 : నావల్ల కాదు. నీ ప్రేమ ముందర నా ద్వేషం, పాపం, అసూయ నిలబడలేదు. నేను ఓడిపోయాను. ఈ జనులందరిని నీ రాజ్యములో చేర్చుకో.

Jesus Dialogue 2: ఎవరైతే తమందరి పాపాల్ని ఒప్పుకుంటారా, నన్ను మనఃస్ఫూర్తిగా తమ జీవితాల్లో ఆహ్వానించి సొంత రక్షకునిగా ఎంచుకొంటారో వారందరూ నా రాజ్య వారసులే.