UECF.NET

UECF Program

Leader: ఆహా ! ఆనందముగా కనబడే నీవు ఎవరవమ్మ ?

← All programs

Ruth

Leader: వాక్యము దేవుడై యున్నాడు . ఆ బైబిలు గ్రంధములో భక్తి గలిగిన స్త్రీలు , భక్తి లేని స్త్రీలు, దేవుని వెంబడించిన వారు , తృణీకరించిన వారు ఉన్నారు.

Leader: ఆహా ! ఆనందముగా కనబడే నీవు ఎవరవమ్మ ?

Ruth: నేను మోయాబీరాలని . మా అత్త పేరు నయోమి . ఆమె నమ్మిన దేవుని నేను కూడా నమ్ముకున్నాను . వివాహ జీవితంలో భర్తను కోల్పోయి , నీరిక్షణ లేని స్తితిలో అత్తగారితో ఇశ్రాయేలు దేశం చేరాను . ఆమె బందువు బొయాజ్ ను వివాహ మాడాను. మొడుబారిన నా జీవితం చిగురించింది . ఆశీర్వాదము ద్వారా దవుడును మునిమానవుడిగా పొంది క్రీస్తు వంశావళిలో నిలిచాను , ధన్యురాలినయ్యాను

Leader: ఎంత గొప్ప చరిత్ర గలదానవమ్మా ! నీ జీవితంతో ఏ పాఠం నేర్పించగలవు?

Ruth: సర్వశక్తిగల దేవుని నమ్మి , ఆయనపై ఆధారపడితే , ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉంటాము

Leader: మంచి మాట చెప్పావు. ధన్యవాధములు.

లోతు భార్య

Lots wife: ఎవరు మీరందరు . ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు .

Leader: నీవు మనిషిలాగానె మాట్లాడుతున్నావు ? కానీ చూడటానికి ఉప్పు స్తంభములా ఉన్నావు . శీలా విగ్రహముగా నిలిచినా నీవెవరమ్మా?

Lot wife: నేను లోతు భార్యను. మేము సూడోమో పట్టణములో నివసించేవారము. లోకాశాలలో , పాపములో ఉన్న మా ప్రాంతాన్ని నాశనము చేయ దలచిన దేవుడు మమ్ములన్నీ రక్షించాలని తలచారు. చెయ్యి పట్టి బయటకు రావాలని త్వరపెట్టి , వెనుకకు చూడరాదన్నారు .నాకస్థిపై , సోదోముపై మమకారం పోలేదు . వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమైయ్యాను.

Leader: అయ్యో పాపం ! నీవిస్థితిలో ఏ పాఠం చెప్పగలవు ?

Lots wife: దేవుని మాటకు విధేయత చూపాలని యు , నిర్లక్షంగా ఉండరాదనియు హెచ్చరికలను తృణీకరిస్తే చాలా నష్టం ఎదుర్కోగలమనీ తెలిసిందమ్మా.

Leader: నిజం. మంచి గుణపాఠం చెప్పవు . ధన్యవాదములు …

రెబ్కా

Leader: కుండ పట్టుకున్న అందమైన వనితవు . నీవేరమ్మ ?

Rebecca: విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాముగారి చే పంపబడిన ఎలియాజరు గారు బావి వద్ద కలిసారు .ప్రయాణములో అలసి యున్నారని , ఆయనకు, వంటెలకు ఈ కుండతో నీళ్లు తోడి పోసాను . అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యగా నిర్ణయించారు , గొప్ప కుటుంబంలో చేర్చబడి దీవించబడ్డాను , ధన్యురాలనయ్యాను.

Leader: నీవు నీ జీవిత పాఠం ఏమని చెప్పగలవు ?

Rebecca: తగ్గింపుతో , దయతో ఇతరులకు సహాయపడితే , మంచి భవిష్యత్తు నిచ్చి చేయి పట్టుకొని నడిపించగల సమర్ధుడు ఆ దేవుడు . ఆయన నన్ను దీవించగా ధన్యురాలినయ్యాను.

Elizabeth

Leader: ఎవరివమ్మా నీవు ? ఎంతో నిబ్బరంగా తృప్తిగా కనిపిస్తున్నావు .

Elizabeth: నేను జాకార్య యాజకుని భార్య ఎలిజబెత్ ను .. దేవుడు మాకు చాలా వృద్ధాప్యంలో అద్భుత రీతిగా సంతానమిచ్చి దీవించారు . నా కుమారుడు యోహాను కారణా జన్ముడు .క్రీస్తు రాకడను సిద్దపరిచాడు , హత సాక్షి అయ్యాడు .యేసు తల్లి కన్యకగా గర్భవతి అయినప్పుడు , అక్కున చేర్చుకొని, ఆశీర్వదింపబడిన మరియతో , నీవు ధన్యురాలివని అభినందించాను . నాకు తృప్తిగా ఉన్నది.

Leader: యోహాను తల్లిగా నీవు కూడా ధన్యురాలివే . నీ అనుభవ పాఠమేమీ ?

Elizabeth: దేవుని అనుగరహం పొందుటకు భయభక్తులు కావలి. క్రమ జీవితం జీవించాలి . బాధలోనున్న వారికి చేయూత నివ్వాలి . దేవుని చత్తంలో పుత్ర శోకాన్ని భరించి దేవుని సేవించాలి ..

Leader: నీ మాటలు చాలా విలువైన సత్యాన్ని భోదిస్తున్నాయి. ధన్యవాదములమ్మ!

క్రీస్తు తల్లి మరియ

Leader: నీ మొఖంలో వెలుగు కనిపిస్తుంది . ఎంతో గొప్ప జీవితం జీవించావని తెలుస్తుంది . ఎవరివమ్మా నీవు ?

Mary: దేవుడు శరీర దారిగా జన్మించుటకు నన్ను యేసు తల్లిగా కన్యకగా నుండగా ఎన్నుకొన్న ధన్యురాలినైన మరియను నేనే . బాల్యం నుండి దైవ భక్తిలో ప్రార్ధించేదానను .దేవుని దూత దర్శించి దయాప్రాప్తురాలా అని సంబోదించి , కన్యకగా పరిశుదాత్మవల్ల గర్భవతినై లోక రక్షకుడైన యేసును పొందుతానని తెల్పిడు

Leader: దయాప్రాప్తురాలని అనబడిన నీ అనుభవాల ద్వారా మేము ఏమీ నేర్చుకోగలము ?

Mary: పవిత్ర జీవితం జీవించాలి . దేవుడు చెప్పిన మాటలను నమ్మి

నీరిక్షించాలి . ఆయన చిత్తానికి లోబడాలి .