సత్సంవత్సరం
ఒకనాడు యూదులపైన ఉన్న కోపంతో ఆనాటి రోమా చక్రవర్తియైన జూలియస్ సీజర్ (క్రీ.పూ. 45 సం॥బైబిల్‌లో దేవుడు వారికిచ్చిన ప్రారంభ దినాన్ని, నెలను మార్చి (మార్చి-ఏప్రిల్) మధ్యలో వచ్చే నేటి ఉగాదిని) జనవరి మొదటి దినానికి మార్చి వేశాడు అని చరిత్రలో రాయబడింది. దానిని నూతన సంవత్సర వేడుకగా పాటించాలని ఆ తర్వాత వచ్చిన వారు గూడా శాసించారు గనుకనే అనంతమైన కాలానికి నూతనత ఏర్పడింది. ఇది అర్థంగాని క్రైస్తవులు కూడా కొత్త సంవత్సరం కోసం ఎదురుచూసి, పాతసంవత్సరానికి వీడ్కోలు చెబుతున్నారు. అయితే వాస్తవానికి దేవుడు ఆశించిన దానిని నిత్యనూతనమైనదిగా మనం మార్చుకొంటూ ఆయనను పూజించి, స్తుతించి, ఆరాధించడమే సర్వమానవాళి ముందున్న తక్షణకర్తవ్యం. నాటి ఆది మానవులు మొదలుకొని నేటి ఆధునిక మానవులవరకు అందరూ తమ అనుభూతిలోనికి వచ్చిన ప్రతిదానిని వింతైనదిగానో, నూతనమైనదిగానో చెప్పడం జరుగుతున్నది. ప్రకృతిని పరిశీలిస్తూ, పరిశోధిస్తూ తన కళ్లకు కనిపించిన వాటినన్నింటినీ కొత్తవిగానో లేక తానే కనుగొన్నదిగానో చెప్పి ఒక ప్రత్యేక ఆనందాన్ని పొందడం అలవాటు చేసుకొన్నాడు. అయితే తాను చూసింది, కొత్తగా కనుగొన్నాను అనుకున్నది అప్పటికే ఉంది అనే ఆలోచన చేయకపోవడమే ఆశ్చర్యకరమైన అంశం. మనిషి తన జీవిత కాలాన్ని లెక్కగట్టుకోవడానికి, దేవుని ఆరాధించడానికి సృష్టించిన కాలాన్ని విడగొట్టి, విపరీతంగా ప్రవర్తించి, ఆ దేవుని సంకల్పాన్ని ధిక్కరిండమే అక్రమము (అ.కా. 17:26).
నేటి అనారోగ్య, ఆర్థిక మాంద్యమున్న దినాల్లో ఈ నూతన సంవత్సర వేడుకలు రోజురోజుకు అధికమై వింత పోకడలకు దారి తీస్తుంది. ఒకప్పుడు క్రైస్తవులు మాత్రమే భక్తితో, ప్రత్యేకంగా జరుపుకొనే పండుగను నేటి క్రైస్తవేతరులు కూడా ఎంతో ఘనంగా జరుపుతున్నారు. క్రైస్తవులు చర్చిల్లో ఈ కొత్త సంవత్సరం కోసం ప్రార్థనతో, కృతజ్ఞతతో ఎదురు చూస్తారు. కాని, ఎవరు స్వాగతించినా, స్వాగతించక పోయినా కాలము ఎవరికోసమూ ఆగదు. సర్వసృష్టికి కారణభూతుడైన మనందరి కన్న తండ్రియైన ఆ పరమాత్ముడు జీవాత్మలమైన మన కోసం బతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథంలో ఈ కాలాలను గూర్చి ఏమి రాయించాడో చూద్దాం. దేవుడు ఒకనాడు తన ప్రజలుగా ప్రత్యేకంగా ఎంచుకొన్న ఇశ్రాయేలీయులు తనను ఆరాధించడానికి వారికిచ్చిన ధర్మశాస్త్రంలో కొన్ని కాలాలను, పండుగలను నియమించాడు. మొదటిసారిగా వారు ఐగుప్తు బానిసత్వంలో నుండి విముక్తి పొందిన రోజును జ్ఞాపకముంచుకోవడానికి వారికి అప్పటి మొదటి సంవత్సరం నేటి ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం మార్చి-ఏప్రిల్ మధ్యలో వచ్చేదన్నమాట. కాని వారు నెలలను, దినాలను, సంవత్సరాలను 1, 2, 3... గా పిలిచేవారు గాని కొత్తదిగా పండుగ చేసుకొన్న ఆధారాలు లేవు. మండుచున్న సూర్యగోళం క్రిందనున్న ఈ పంచభూతాలలో అనగా మానవ నివాసయోగ్యమైన భూగోళంలో ఉన్న దాంట్లో నూతనమైనదేదియు లేదని, అంతా ఎప్పుడో నేను సృష్టించిన అతి పురాతనమైనదని చెప్పేశాడు. అయితే ఎవడో ఒకడు తనకు పుట్టిన సత్సంవత్సరం
ఒకనాడు యూదులపైన ఉన్న కోపంతో ఆనాటి రోమా చక్రవర్తియైన జూలియస్ సీజర్ (క్రీ.పూ. 45 సం॥బైబిల్‌లో దేవుడు వారికిచ్చిన ప్రారంభ దినాన్ని, నెలను మార్చి (మార్చి-ఏప్రిల్) మధ్యలో వచ్చే నేటి ఉగాదిని) జనవరి మొదటి దినానికి మార్చి వేశాడు అని చరిత్రలో రాయబడింది. దానిని నూతన సంవత్సర వేడుకగా పాటించాలని ఆ తర్వాత వచ్చిన వారు గూడా శాసించారు గనుకనే అనంతమైన కాలానికి నూతనత ఏర్పడింది. ఇది అర్థంగాని క్రైస్తవులు కూడా కొత్త సంవత్సరం కోసం ఎదురుచూసి, పాతసంవత్సరానికి వీడ్కోలు చెబుతున్నారు. అయితే వాస్తవానికి దేవుడు ఆశించిన దానిని నిత్యనూతనమైనదిగా మనం మార్చుకొంటూ ఆయనను పూజించి, స్తుతించి, ఆరాధించడమే సర్వమానవాళి ముందున్న తక్షణకర్తవ్యం. నాటి ఆది మానవులు మొదలుకొని నేటి ఆధునిక మానవులవరకు అందరూ తమ అనుభూతిలోనికి వచ్చిన ప్రతిదానిని వింతైనదిగానో, నూతనమైనదిగానో చెప్పడం జరుగుతున్నది. ప్రకృతిని పరిశీలిస్తూ, పరిశోధిస్తూ తన కళ్లకు కనిపించిన వాటినన్నింటినీ కొత్తవిగానో లేక తానే కనుగొన్నదిగానో చెప్పి ఒక ప్రత్యేక ఆనందాన్ని పొందడం అలవాటు చేసుకొన్నాడు. అయితే తాను చూసింది, కొత్తగా కనుగొన్నాను అనుకున్నది అప్పటికే ఉంది అనే ఆలోచన చేయకపోవడమే ఆశ్చర్యకరమైన అంశం. మనిషి తన జీవిత కాలాన్ని లెక్కగట్టుకోవడానికి, దేవుని ఆరాధించడానికి సృష్టించిన కాలాన్ని విడగొట్టి, విపరీతంగా ప్రవర్తించి, ఆ దేవుని సంకల్పాన్ని ధిక్కరిండమే అక్రమము (అ.కా. 17:26).
నేటి అనారోగ్య, ఆర్థిక మాంద్యమున్న దినాల్లో ఈ నూతన సంవత్సర వేడుకలు రోజురోజుకు అధికమై వింత పోకడలకు దారి తీస్తుంది. ఒకప్పుడు క్రైస్తవులు మాత్రమే భక్తితో, ప్రత్యేకంగా జరుపుకొనే పండుగను నేటి క్రైస్తవేతరులు కూడా ఎంతో ఘనంగా జరుపుతున్నారు. క్రైస్తవులు చర్చిల్లో ఈ కొత్త సంవత్సరం కోసం ప్రార్థనతో, కృతజ్ఞతతో ఎదురు చూస్తారు. కాని, ఎవరు స్వాగతించినా, స్వాగతించక పోయినా కాలము ఎవరికోసమూ ఆగదు. సర్వసృష్టికి కారణభూతుడైన మనందరి కన్న తండ్రియైన ఆ పరమాత్ముడు జీవాత్మలమైన మన కోసం బతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథంలో ఈ కాలాలను గూర్చి ఏమి రాయించాడో చూద్దాం. దేవుడు ఒకనాడు తన ప్రజలుగా ప్రత్యేకంగా ఎంచుకొన్న ఇశ్రాయేలీయులు తనను ఆరాధించడానికి వారికిచ్చిన ధర్మశాస్త్రంలో కొన్ని కాలాలను, పండుగలను నియమించాడు. మొదటిసారిగా వారు ఐగుప్తు బానిసత్వంలో నుండి విముక్తి పొందిన రోజును జ్ఞాపకముంచుకోవడానికి వారికి అప్పటి మొదటి సంవత్సరం నేటి ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం మార్చి-ఏప్రిల్ మధ్యలో వచ్చేదన్నమాట. కాని వారు నెలలను, దినాలను, సంవత్సరాలను 1, 2, 3... గా పిలిచేవారు గాని కొత్తదిగా పండుగ చేసుకొన్న ఆధారాలు లేవు. మండుచున్న సూర్యగోళం క్రిందనున్న ఈ పంచభూతాలలో అనగా మానవ నివాసయోగ్యమైన భూగోళంలో ఉన్న దాంట్లో నూతనమైనదేదియు లేదని, అంతా ఎప్పుడో నేను సృష్టించిన అతి పురాతనమైనదని చెప్పేశాడు. అయితే ఎవడో ఒకడు తనకు పుట్టిన బుద్ధితో ఏదో ఒక దానిని కొత్తది అని చెప్తాడు. దానినే మనుషులందరూ దేవుని ఉపదేశంగా భావించి ఘనంగా చేస్తారు అని కూడా చెప్పించాడు (మార్కు సువార్త 7:6-9). దేవుడు కనిపెట్టమన్నది, ఎదురుచూడమన్నది కొత్తభూమి, కొత్త ఆకాశం, కొత్తలోకం (పరలోకం) కోసం, ఈ యుగాంతం కోసం. సంతోషంగా, భక్తితో ఉండండి అనేది మర్చిపోయి సాతాను మాయలో పడ్డారు (2 పేతురు 3:8-13). ఇలాంటి వ్యర్థమైన ఆచారాలతో తనను వ్యర్థముగా ఆరాధిస్తారని ముందే ఎరిగిన దేవుడు తన సృష్టిలో ఏది నూతనమైనది నేను చేస్తానో, ఏది నూతనమైనది మనిషి చేసి చూపించి దేవునిని ఆనందపరచాలో సత్యవేదమైన బైబిల్‌లో రాయించాడు. క్రీస్తుకు ముందే తాను ఎంచుకున్న ప్రజలద్వారా ఈ యుగాంతమందున్న మనకు బుద్ధిగలగడానికి దేవుడు చెప్పిన మాటలివి: ‘‘నూతన హృదయాన్ని, నూతన మనస్సును, మీలోని రాతిలాంటి గుండెను మళ్లీ మాంసము గుండెను మార్చి కొత్తదానిగా మారుస్తాను అని వాగ్దానం చేశాడు (యెహెజ్కేలు 36:26). ఇది నూతన నిబంధనలో ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడైన క్రీస్తు ద్వారా నెరవేరింది. మనిషి తాను సృష్టించినదాంట్లో పాతది, కొత్తది, వింతైనదేమైనా ఉంటే ఉండవచ్చునేమోగాని కాలంలో అటువంటివేమీ ఉండవు. దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి గాని నాశనం చేసుకోకూడదు. దేవుని పిల్లలైన ప్రతివారు ఆయన ఇష్టాన్ని బట్టి, ఆయన అనాది సంకల్పమును నెరవేర్చుటకై సం॥నెలలను, దినాలను కొత్తవిగా ఎంచి ఆనందించక తమ హృదయాలను, దాని ఆలోచనలకు కారణమైన మనస్సును నూతన పర్చుకొని తన బతుకును ఎప్పటికప్పుడు కొత్తదిగా చేసుకొని ఆనందించాలని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ‘‘కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యదార్థమైన భక్తిగలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను’’ (ఎఫెసీ 4:22-24 ; రోమా 12:2 ; కొలస్సీ 3:10 ; తీతు 3:5). ఎన్ని కొత్త సంవత్సరాలకోసం ఎదురుచూసి, సరికొత్త విధానాలతో సంతోషపడి సంబరాలు చేసుకొన్నా, మనసుమారి, మన బ్రతుకులో నూతనత్వం కనబడకపోతే సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో మహాజ్ఞానియైన సొలొమోను మహారాజు తాను లోకానికిచ్చిన జ్ఞానం, సామెతలు గ్రంథంలో రాసిన వాటిని చదివితే అందరూ ఆలోచిస్తే నేడు ఈ వేడుకల్లో జరుగుతున్న ఎన్నో అపశృతులను ఆపి, ధన, మాన, ప్రాణాలను రక్షించుకోవచ్చు. మానవత్వంలో నుండి దేవత్వంలోనికి మార్పుచెంది మానవ కల్యాణం కోసం కంకణం కట్టుకొని దివారాత్రులు శ్రమించడంలోనే నూతనత్వం ఉంది గాని మరి దేంట్లో కొత్తదనం లేదని ఆలోచించినవారే ధన్యులు. - డా. బి. జాన్
కాలానికి కొత్త, పాత లేవు. సృష్టిలో, మానవుని దృష్టిలో విలువైనది, మనిషికి తగిలిన ప్రతి గాయాన్ని మాన్పివేసే దివ్యఔషధం కాలం. రేపటిని గూర్చి ఎదురుచూసి, అది జరక్కపోతే చింతించకు (మత్తయి 7:34). ఎందుకంటే రేపటికి నీవు ఉంటావో లేదో, రేపేమి జరుగునో నీకు తెలియదు (యాకోబు 4ఫ14) అన్నాడు దేవుడు.
బుద్ధితో ఏదో ఒక దానిని కొత్తది అని చెప్తాడు. దానినే మనుషులందరూ దేవుని ఉపదేశంగా భావించి ఘనంగా చేస్తారు అని కూడా చెప్పించాడు (మార్కు సువార్త 7:6-9). దేవుడు కనిపెట్టమన్నది, ఎదురుచూడమన్నది కొత్తభూమి, కొత్త ఆకాశం, కొత్తలోకం (పరలోకం) కోసం, ఈ యుగాంతం కోసం. సంతోషంగా, భక్తితో ఉండండి అనేది మర్చిపోయి సాతాను మాయలో పడ్డారు (2 పేతురు 3:8-13). ఇలాంటి వ్యర్థమైన ఆచారాలతో తనను వ్యర్థముగా ఆరాధిస్తారని ముందే ఎరిగిన దేవుడు తన సృష్టిలో ఏది నూతనమైనది నేను చేస్తానో, ఏది నూతనమైనది మనిషి చేసి చూపించి దేవునిని ఆనందపరచాలో సత్యవేదమైన బైబిల్‌లో రాయించాడు. క్రీస్తుకు ముందే తాను ఎంచుకున్న ప్రజలద్వారా ఈ యుగాంతమందున్న మనకు బుద్ధిగలగడానికి దేవుడు చెప్పిన మాటలివి: ‘‘నూతన హృదయాన్ని, నూతన మనస్సును, మీలోని రాతిలాంటి గుండెను మళ్లీ మాంసము గుండెను మార్చి కొత్తదానిగా మారుస్తాను అని వాగ్దానం చేశాడు (యెహెజ్కేలు 36:26). ఇది నూతన నిబంధనలో ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడైన క్రీస్తు ద్వారా నెరవేరింది. మనిషి తాను సృష్టించినదాంట్లో పాతది, కొత్తది, వింతైనదేమైనా ఉంటే ఉండవచ్చునేమోగాని కాలంలో అటువంటివేమీ ఉండవు. దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి గాని నాశనం చేసుకోకూడదు. దేవుని పిల్లలైన ప్రతివారు ఆయన ఇష్టాన్ని బట్టి, ఆయన అనాది సంకల్పమును నెరవేర్చుటకై సం॥నెలలను, దినాలను కొత్తవిగా ఎంచి ఆనందించక తమ హృదయాలను, దాని ఆలోచనలకు కారణమైన మనస్సును నూతన పర్చుకొని తన బతుకును ఎప్పటికప్పుడు కొత్తదిగా చేసుకొని ఆనందించాలని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ‘‘కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యదార్థమైన భక్తిగలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను’’ (ఎఫెసీ 4:22-24 ; రోమా 12:2 ; కొలస్సీ 3:10 ; తీతు 3:5). ఎన్ని కొత్త సంవత్సరాలకోసం ఎదురుచూసి, సరికొత్త విధానాలతో సంతోషపడి సంబరాలు చేసుకొన్నా, మనసుమారి, మన బ్రతుకులో నూతనత్వం కనబడకపోతే సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో మహాజ్ఞానియైన సొలొమోను మహారాజు తాను లోకానికిచ్చిన జ్ఞానం, సామెతలు గ్రంథంలో రాసిన వాటిని చదివితే అందరూ ఆలోచిస్తే నేడు ఈ వేడుకల్లో జరుగుతున్న ఎన్నో అపశృతులను ఆపి, ధన, మాన, ప్రాణాలను రక్షించుకోవచ్చు. మానవత్వంలో నుండి దేవత్వంలోనికి మార్పుచెంది మానవ కల్యాణం కోసం కంకణం కట్టుకొని దివారాత్రులు శ్రమించడంలోనే నూతనత్వం ఉంది గాని మరి దేంట్లో కొత్తదనం లేదని ఆలోచించినవారే ధన్యులు. - డా. బి. జాన్