శ్రీయేసుండు జన్మించె రేయీలో
పల్లవి: శ్రీయేసుండు జన్మించె రేయీలో - నేడు పాయక బెత్లెహేము యూరిలో .. శ్రీ..
1. కన్నియ మరియమ్మ గర్భామందున - నిమ్మానుయేలనిడి నామమందున .. శ్రీ..
2. సత్ర మందున బశువుల సాలయందున - దేవ - పుత్రుండు మనుజుండాయెనందున 3. పట్టి పొత్తిగుడ్డలతో జుట్టబడి - పసుల - తొట్టిలో బరుండ బెట్టబడి .. శ్రీ..
4. అక్షయుండగు యేసు వచ్చెను - మనకు - రక్షణంబు సిద్దపర్చెను .. శ్రీ..
Hymn Lyrics
O come, all ye faithful, Joyful and triumphant,
O come ye, O come ye to Bethlehem;
Come and behold him, Born the King of angels;
O come, let us adore him, O come, let us adore him,
O Come, let us adore him, Christ the Lord.
God of God, Light of Light,
Lo! he abhors not the Virgin's womb:
Very God, Begotten, not created; Refrain
Sing, choirs of angels, Sing in exultation,
Sing, all ye citizens of heaven above;
Glory to God In the highest; Refrain
See how the shepherds, Summoned to his cradle,
Leaving their flocks, draw nigh to gaze;
We too will thither Bend our joyful footsteps; Refrain
Joy to the world! the Lord is come;
Let earth receive her King;
Let every heart prepare Him room,
and heaven and nature sing,
and heaven and nature sing,
and heaven, and heaven and nature sing.
Joy to the earth! the Savior reigns;
Let men their songs employ;
while fields and floods,
rocks, hills and plains
Repeat the sounding joy,
Repeat the sounding joy,
Repeat, repeat the sounding joy.
No more let sins and sorrows grow,
nor thorns infest the ground;
He comes to make His blessing flow
far as the curse is found,
far as the curse is found,
far as, far as the curse is found.
He rules the world with truth and grace,
and makes the nations prove
the glories of His righteousness,
and wonders of His love,
and wonders of His love,
and wonders, wonders of His love.
క్రీస్తు జననము
పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం .. హల్లెలుయా..
1. దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పినావు 2X
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప
నీ సత్యము చాటింప - నీ వెలుగును ప్రకాశింప 2X
.. హల్లెలుయా..
2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ 2X
.. హల్లెలుయా..
ఉదయ కాంతి రేఖలో
పల్లవి: ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
1. పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని 2X .. ఉదయ..
2. ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి .
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట 2X ..ఉదయ..
నిలిచె నీ రేయీ
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో …(Music Bit)
1. ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి -ఈ భువిలో (music)
ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గె నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో …(Music Bit)
2. ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త (music)
ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గె నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో