UECF.NET

UECF Program Sep 01st, 2019 4:30 PM

Announcements

← All programs
Order of Worship

Sep 01st, 2019 Worship Service

Opening Prayer:
*Opening Hymn: ‘ యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ’ insert
Worship Songs in English & Telugu UECF Children & Youth
Special Song ‘రండి సువార్త సునాదముతో’ UECF Elderly Women
Worship Songs in English & Telugu UECF Choir
Prayers of the People:
Program Details

ఆరాధన క్రమము Rev. Devadanam Gummadi

బో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.

సభ ఆమేన్.

బో: నీ వెలుగును, నీ సత్యమును బయలు దేర జేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞాతా స్తుతులు చెల్లించెదను.

పాపపుటొప్పుదల

బో: ప్రభువు నందు ప్రియులారా! యదార్థ హృదయముతో మన తండ్రియైన దేవుని సమీపించి, ఆయన యెదుట మన పాపముల నొప్పుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయ చేయుమని వేడుకొందము.

బో: ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.

సభ: భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.

బో: ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని.

సభ: నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు.

బో: మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా! దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు. అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మనియు నీ యెదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై

వచ్చుచున్నాము.

* సభ బోధకునితో కలిసి ఇట్లు చెప్పవలెను

మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా! మమ్మును కనికరించి, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు, నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరియైన ఙ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృధ్ధి పొందింపుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.

బో: మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపొవుటకై తన యేక కుమారునిచ్చి, ఆయన మూలమున మన పాపములంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చును. వారికి తన పరిశుధ్ధాత్మ ననుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును.

ఓ ప్రభువా! ఈ రక్షణను మా యందరికి దయచేయుము.

సభ: ఆమేన్

ప్రారంభ గీతము

లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవానుబట్టి ఆనంద గానము చేయుడి! స్తుతి చేయుట యదార్థవంతులకు శోభస్కరము.

త్య్రేకుని మహిమ

తండ్రికిన్, కుమారునికిన్, పరిశుద్ధాత్మకును ఆదియందు, ఇప్పుడు ఎల్లపుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.

ప్రభుని కనికరము

బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.

బో: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.

సభ: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.

బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.

సర్వోన్నతుని మహిమ

బో: సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక = కలుగు నున్నతమైన - ఘన స్థలములందున - ఇలకు సమాధానం - నరుల కాయన దయ|| ప్రభువైన దేవా - పరమ రాజా - సర్వపరిపాలనా = పరిపూర్ణ శక్తిగల పరమజనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడు చున్నాము ||

మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును - మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృతఙ్ఞత నిచ్చు చున్నాము. ||

*ఏక కుమారా - యేసు ప్రభువా - యెహొవా - తనయా - లోకపాపము మోయు - ఏక దేవుని గొఱ్ఱె - పిల్ల! మమ్మును కనిక - రించుము చల్లగ||

*లోకపాపములు - మోసుకుపోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసు ! మా ప్రార్థనా-లించి కనికరించు ||

పరిశుధ్ధుడవు - ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - పరిపూర్ణ మహిమతో = ప్రబలు చున్నావెపుడు ||ఆమేన్||

బో: ప్రభువు మీతో నుండు గాక.

సభ: మీ అత్మతో నుండు గాక

బో: ప్రార్థింతము

సంగ్రహ ప్రార్థన

సర్వశక్తిగల నిత్యుడ వైన దేవా, మేము ప్రార్దించుటకు సిద్దమనస్కులముగా నుండునంతకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగానున్నావు. మేము కోరు దానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా ననుగ్రహించువాడవై యున్నావు. వీటిని గూర్చి మా మనసాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసు క్రీస్తు నీతి మధ్య వర్తిత్వముల ద్వారా తప్ప మరి దేనిని బట్టియైనను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవుల ననుగ్రహించి నీ కరుణాసమృద్దిని మా మీద కుమ్మరింపుమని నీతోను, పరిశుద్ద్దాత్మతోను సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరి పాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము.

సభ: ఆమేన్

పాత నిబంధన పాఠము – యిర్మీయా 2: 4-13

*పాత నిబంధన భాగము చదువుట ముగియగానే పాడ వలసినది

సభ: పరిశుద్ధుడవగు దేవా! పావన శక్తుడ దేవా ! పావన అమర్త్య దేవా ! మమ్మును కనికరింపుము.

పత్రిక పాఠము – హెబ్రీ 13: 1-8

బో: ఇంతటితో ఈ దినమునకైన పత్రిక పాఠము ముగియుచున్నది.

సభ: హల్లెలూయా ! హల్లెలూయా ! హల్లెలూయా!

సువార్త పాఠము – లూకా 14: 7-14

సభ: ఓ ప్రభువా! నీకు మహిమ కలుగును గాక.

అపోస్తులు విశ్వాస ప్రమాణము

భూమ్యకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవుని నేను నమ్ము చున్నాను. ఆయన ఏక కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము చున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వెయబడి చనిపోయి సమాధి వేయబడెననియు, అదృశ్యలోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున కెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుత్ఢానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.

బో: మన తండ్రి యైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక.

బో: సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలి యుండును గాక

సభ: ఆమేన్

Special Music: Bro. K.Y. Ratnam

Sermon: Rev. Barnabas Sajja

దేవా! నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము = నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము || నీసన్నిధానములోనుండి నన్ను త్రోసివేయకుము = నీ పరిశుద్దాత్మను నా యొద్దనుండి తీసివేయకుము || నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము = సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృద్ధపరచుము ||

అర్పణలు Offertory

నీ కిచ్చు అర్పణలు - నీవే మా కిచ్చితివి = మా కున్న సకలాస్తుల్ - మా ప్రభువా యవి నీవి గదా - నీ కిచ్చు అర్పణలు - నీ విపుడు గైకొనుమా ||

6:55 PM *Closing Prayer & Benediction: Rev. Barnabas Sajja

పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా = పంపుము దయ చేత - పతిత పావన నామ - పెంపుగా నీ సేవ - ప్రియా మొప్ప నొనరింప - పంపుము దేవా - దీవెనలతో - పంపుము దేవా

Visit us online at http://www.uecf.net

About Rev. Barnabas Sajja

Rev. Barnabas Sajja was born in one of the highest privileged Hindu families in the state of Andhra Pradesh, India and practiced idol worship till the year 1971. His education couldn't take its full form and he was forced to discontinue his studies due to the political agitation in his region. In order to support his living he lived in a far off town which was about 700 kms. from his home town where he became a slave to idols, cinemas and was indulged in various worldly affairs. At this point when he was leading a sinful life, he received a letter from his elder sister who had already accepted Jesus as her savior. The letter made him to think of the real life and encouraged him to take a Bible and read it.

Being encouraged by his mother, for the first time he stepped into a church at the end of the year 1971. There he tasted the love of the Lord for the first time in his life. He was touched and warned by the Lord through Joel 2:12-14 and got saved from the coming judgment and hell fire. He was miraculously called by the Lord to serve HIM full time in the year 1973. Rev. Barnabas Sajja was trained in the Church of God Bible College, Kakinada. After completing his course successfully, he stepped into the Master's Vineyard on the 1st day of March, 1976, just 14 days after his marriage with Jeevan Rani. His determination commitment and obedience to the Lord's call made him a great blessing to many people. His zeal and enthusiasm for the Lord's ministry gave him an opportunity to go through a "Leadership Training Program" at the Christ for the Nations Institution 1987-88. Gospel Prayer Temple Ministries was established in the year 1996 with a mission To Preach Pray and Build. The Ministry that was started with fasting, tested with battles and watered with tears, has now become a hope to the hopeless, shelter to the homeless, giving love to the rejected, proclaiming Gospel to the perishing souls and taking care of many poor and orphan kids.

Visit us online at http://www.uecf.net

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Rev. Barnabas Sajja as he brings the Word of God today.
  • Please continue to pray for UECF’s own Church building.
  • Please pray for all the elderly for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays(Rev. Ebenezer Mallepalle, Mr. Anand Devi, Mr. Immanuel Lakinam, Mr. Benjamin Ranjith Muthyala, Mrs. Padmini Peterson, Jennifer Maddela, Mrs. Persis Bandari) and Wedding Anniversary (Mrs. Hadassah & Mr. Francis Pulipati, Mrs. Manoranjani & Mr. Praveen Yeddu) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

ANNOUNCEMENTS

  • Thanks to Rev. Barnabas Sajja, Rev. Devadanam Gummadi and Bro. KY. Ratnam for ministering to us today.
  • Next week, Bro. Ranganadh(UESI Vizag) will bring the Word of God and special music.
  • Pastor P. J. Stephen Paul will bring the Word of God on Sept 15th.
  • Rev. Dr. David Ravinder will bring the Word of God on Sep 22nd.
  • Rev. Gideon Kalepalli will bring the Word of God on Sep 29th in Telugu
  • Rev. Joseph Moses Kolasanakoti will bring the Word of God on Oct 06th.
  • Bro. Edgar Satuluri will bring the Word of God on Oct 20th.
  • Rev. Dr. David Ravinder will bring the Word of God on Oct 27th.
  • Rev. Joseph Sandeep Vadegar will bring the Word of God on Nov 03rd.
  • Today’s Fellowship Hour is hosted by DEVIs.
  • Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.

Sep

1

DEVIs

8

15

UECF

Families

22
MYLAs

29

Oct

6

13

20

MUTHYALAs

27

--

Nov

3

10

17

SAM RAPAKAs

24
UECF

Families

--

Dec

1

8

PILLIs

15

22
UECF

Families

25

UECF

Birthdays:

  • Rev. Ebenezer Mallepalle 01st Sep
  • Mr. Anand Devi 03rd Sep
  • Mr. Immanuel Lakinam 04th Sep
  • Mr. Benjamin Ranjith Muthyala 05th Sep
  • Mrs. Padmini Peterson 06th Sep
  • Jennifer Maddela 08th Sep
  • Mrs. Persis Bandari 08th Sep

Program image 002Anniversaries:

  • Mrs. Hadassah & Mr. Francis Pulipati 01st Sep
  • Mrs. Manoranjani & Mr. Praveen Yeddu 05th Sep

  యెహోవా నీ నామము

పల్లవి: యెహోవా నీ నామము - ఎంతో బలమైనది  ...ఆ...ఆ...ఆ...

యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||

1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి  || యెహోవా ||

2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా 

అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా ||

3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి 

ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము || యెహోవా ||

4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా 

సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను  || యెహోవా ||

రండి సువార్త సునాదముతో

పల్లవి: రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో - ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2)    ||రండి||

1. యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం - భాసుర క్రైస్తవ శుభ నామం           ||రండి||

2. యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత - జనముల సుఖవాసం           ||రండి||

3. యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్ధన సహకారం           ||రండి||

4. యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి           ||రండి||

5. యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జన స్తోత్రం           ||రండి||

Come, now is the time to worship(D)
Come, now is the time to give your heart
Come, just as you are to worship
Come, just as you are before your God
Come

One day every tongue will confess You are God
One day every knee will bow
Still, the greatest treasure remains for those
Who gladly choose You now

Come, now is the time to worship
Come, now is the time to give your heart
Come, just as you are to worship
Come, just as you are before your God
Come

One day every tongue will confess You are God
One day every knee will bow
Still, the greatest treasure remains for those
Who gladly choose You now

As the deer panteth for the water,

So my soul longeth after You.

You alone are my heart's desire,

And I long to worship You.

You alone are my strength, my shield,

To you alone may my spirit yield.

You alone are my heart's desire,

And I long to worship You.

I want You more than gold or silver,

Only You can satisfy.

You alone are the real joy giver,

And the apple of my eye.

You're my friend and You are my brother,

Even though you are a King.

I want you more than any other,

So much more than anything.

He became sin, who knew no sin

He became sin, who knew no sin

That we might become His righteousness

He humbled himself and carried the cross

Love so amazing, love so amazing

Jesus Messiah, name above all names

Blessed redeemer, Emmanuel

The rescue for sinners, the ransom from Heaven

Jesus Messiah, Lord of all

His body the bread, his blood the wine

Broken and poured out all for love

The whole earth trembled, and the veil was torn

Love so amazing, love so amazing, yeah

Jesus Messiah, name above all names

Blessed redeemer, Emmanuel

The rescue for sinners, the ransom from Heaven

Jesus Messiah, Lord of all

All I hope is in You, all I hope is in You

All the glory to You, God, the light of the world

Jesus Messiah, name above all names

Blessed redeemer, Emmanuel

The rescue for sinners, the ransom from Heaven

Jesus Messiah, Lord of all

Jesus Messiah, Lord of all

The Lord of all

The Lord of all

నా కనుల వెంబడి కన్నీరు రానీయ్యక

ఆ ఆ ఆ .. ఆ ఆ ఆ ఆ ఆ

పల్లవి: నా కనుల వెంబడి కన్నీరు రానీయ్యక

నా ముఖములో దు:ఖమే ఉండనియ్యక

చిరునవ్వుతో నింపిన యేసయ్య

చిరునవ్వుతో నింపిన యేసయ్యా..

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే 

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే 

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే    ..నా కనుల..

1. అవమానాలను - ఆశీర్వాదముగా

నిందలన్నిటిని - దీవెనలుగా మార్చి 

అవమానాలను - ఆశీర్వాదముగా

నిందలన్నిటిని - దీవెనలుగా మార్చి 

నేను వేసే ప్రతి అడుగులో  నీవే నా దీపమై 

నేను వేసే ప్రతి అడుగులో  నీవే నా దీపమై.. 

చిరునవ్వుతో నింపిన యేసయ్య

చిరునవ్వుతో నిం పిన యేసయ్యా..

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే 

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే .. ఆరాధన..

2. సంతృప్తి లేని నా జీవితంలో 

సమృద్ది నిచ్చి ఘన పరచి నావు 

సంతృప్తి లేని నా జీవితంలో 

సమృద్ది నిచ్చి ఘన పరచి నావు

నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి 

నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి.. 

చిరునవ్వుతో నింపిన యేసయ్య 

చిరునవ్వుతో నిం పిన యేసయ్యా..

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే 

ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే .. ఆరాధన..  ..నా కనుల..

నీ కనుదృష్టి నాపై ఉంచి

 పల్లవి:   నీ కనుదృష్టి  నాపై ఉంచి              

నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా            
కంటికి రెప్పలా కాచిన దేవుడా               

కునుకక నిద్రించిన దాచిన దేవుడా 
నీకే స్త్రోత్రము  ... నీకే స్త్రోత్రము 

1. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ 
    ప్రాకారముగా ఉంచావయ్యా  
    నా బలహీనతలో నా బలము నీవై 
    నా భయములన్నిటిని తీసావయ్యా 

అ.ప. ఏ అపాయమైననూ దరిచేర నియ్యక 
         ఏ శత్రువైననూ నను తాకనివ్వక 
         నీ కృపతో నన్ను కాచినావు ఏసయ్యా 
         నీ దయతో నన్ను దాచినావు ఏసయ్యా 
         నీకే స్త్రోత్రము  ... నీకే స్త్రోత్రము 

2. ఎవ్వరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి 
    నీ జీవగ్రధంలో నా పేరు ఉంచావు 
    నీ అగ్ని నా చుట్టు సరిహద్దు చేసి 
    పరిశుధ్ధ రక్తములో నను కప్పినావు   ||ఏ అపా||